Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో యువకుడి గొంతు కోసి హత్యాయత్నం..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో యువకుడి గొంతు కోసి హత్యయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది.

Miryalaguda : మిర్యాలగూడలో యువకుడి గొంతు కోసి హత్యాయత్నం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో యువకుడి గొంతు కోసి హత్యయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. కేశవ నగర్ కాలనీకి చెందిన గంగవరపు శ్రీనివాసరావు సాల్వెంట్ మిల్లులో పనిచేస్తున్నాడు. అదే మిల్లులో తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి కూడా పనిచేస్తున్నట్లు సమాచారం.

కాగా ఆదివారం రాత్రి మధుసూదన్ రెడ్డి ఆకస్మాత్తుగా తనతో తెచ్చుకున్న కత్తితో శ్రీనివాసరావు పై గొంతు కోసి హత్యయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో కింద పడిపోయిన శ్రీనివాస్ రావు ను వెంటనే మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. అతడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మధుసూదన్ రెడ్డి పరారీలో ఉన్నాడు.

MOST READ 

మరిన్ని వార్తలు