Nalgonda : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని.. మోకాళ్లపై చెరువుగట్టు మెట్లు ఎక్కనున్న అభిమాని..!

Nalgonda : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని.. మోకాళ్లపై చెరువుగట్టు మెట్లు ఎక్కనున్న అభిమాని..!
నాంపల్లి( మునుగోడు), మన సాక్షి :
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కాలని కోరుకుంటూ ముష్టిపల్లికి చెందిన ముష్టిపల్లి లింగస్వామి చేపట్టిన పాదయాత్ర మంగళవారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. తన అభిమాన నాయకుడు మంత్రి అయితే నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని లింగస్వామి ఆకాంక్షించారు.
యాత్ర ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో లింగస్వామి కీలక ప్రకటన చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న అనంతరం, కొండపై ఉన్న ఆలయ మెట్లను ఆయన మోకాళ్లపై నడుస్తూ ఎక్కి స్వామివారికి తన మొక్కును సమర్పించనున్నారు. నాయకుడిపై ఉన్న అచంచలమైన అభిమానంతో ఆయన చేస్తున్న ఈ కఠిన దీక్ష స్థానికంగా చర్చనీయాంశమైంది.
పాదయాత్ర నాలుగో రోజుకు చేరుకున్న సందర్భంగా దారిపొడవునా ప్రజలు లింగస్వామికి నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమంలో ఉడుతలపళ్లి గ్రామ సర్పంచ్ కావలి శివాని సురేష్, మాజీ సర్పంచులు కావలి ఆంజనేయులు, మేకల వెంకన్న, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బుసిపాక శంకర్, వార్డ్ మెంబర్ కావలి అశోక్ పాల్గొని మద్దతు తెలిపారు.
వారితో పాటు గంట వెంకన్న, మెరుగు చిరంజీవి, కొంక నరేందర్, అనిల్, మల్లయ్య తదితర గ్రామస్తులు లింగస్వామి వెన్నంటి నడిచి ధైర్యాన్ని నింపారు









