Breaking NewsTOP STORIESతెలంగాణహైదరాబాద్
Gold Price : పసిడి ప్రియులకు శుభవార్త.. ధర తగ్గింది తెలుసా.. ఈరోజు ఎంతంటే..!
చాలా రోజుల తర్వాత పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అందింది. గురువారం బంగారం ధర తగ్గింది. దాంతో మహిళలు ఆనందంలో ఉన్నారు .

Gold Price : పసిడి ప్రియులకు శుభవార్త.. ధర తగ్గింది తెలుసా.. ఈరోజు ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో:
చాలా రోజుల తర్వాత పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అందింది. గురువారం బంగారం ధర తగ్గింది. దాంతో మహిళలు ఆనందంలో ఉన్నారు . ఈరోజు బంగారం ధర ఎంత తగ్గింది అంటే.. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 12000 రూపాయలు తగ్గింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 11000 రూపాయలు తగ్గింది.
ఈరోజు తులం ఎంతంటే..!
గురువారం హైదరాబాద్ బంగారం మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్స్ తులం బంగారం ధర 1200 రూపాయలు తగ్గి 1,53,550 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం కు 1100 రూపాయలు తగ్గి 1,40,750 రూపాయలుగా ఉంది. హైదరాబాదులో ఉన్న ఈ ధరలు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే కొనసాగుతున్నాయి.









