Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Karimnagar : కరీంనగర్ లో ఉద్రిక్తత.. బండి సంజయ్ పై నోరు జారిన కౌశిక్ రెడ్డి..!

కరీంనగర్ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై దాడికి ప్రయత్నం జరిగింది. అయితే నగరంలోని గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పై అనుచిత వాఖ్యలు చేశారంటు బీజేపీ శ్రేణులు క్యాంపు కార్యాలయంలోకి చొరబడి కార్యాలయం, వాహనం అద్దాలు ధ్వంసం చేశారు.

Karimnagar : కరీంనగర్ లో ఉద్రిక్తత.. బండి సంజయ్ పై నోరు జారిన కౌశిక్ రెడ్డి..!

గంగుల క్యాంపు కార్యాలయం పై బీజేపీ శ్రేణుల దాడి

కారు అద్దాలు ద్వాంసం చేసిన బీజేపీ కార్యకర్తలు

కరీంనగర్, మనసాక్షి :

కరీంనగర్ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై దాడికి ప్రయత్నం జరిగింది. అయితే నగరంలోని గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పై అనుచిత వాఖ్యలు చేశారంటు బీజేపీ శ్రేణులు క్యాంపు కార్యాలయంలోకి చొరబడి కార్యాలయం, వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. కౌశిక్ రెడ్డి మీడియా సమావేశంలో కేంద్రమంత్రి బండి సంజయ్ పై తీవ్ర వ్యక్తిగత విమర్శలు చేశారు.

తంబాకులో డ్రగ్స్ కలిపి తినడం వల్లే బండి సంజయ్ కు బట్టతల వచ్చిందని హెద్దెవా చేశారు. గతంలో ఆయన తన భార్య పుస్తెల్ని అమ్మి ఎన్నికల్లో పోటీ చేసినట్లు చెప్పారన్నారు. ఎన్నికల్లో బండిసంజయ్ పంచింది అవినీతి డబ్బా లేక రేవంత్ పంపిన డబ్బా అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో దాడులకు పాల్పడ్డారు.

బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపు చేశారు. ప్రస్తుతం గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు