Suryapet : విద్యుత్ షాక్తో ఒక్క రోజే ఇద్దరు మృతి..!
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలో వరుస విద్యుత్ ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు విద్యుత్ సరఫరాలో లోపాలు, మరోవైపు నిర్లక్ష్యంగా ఉన్న విద్యుత్ లైన్లు ప్రాణాలు తీస్తుండటంతో మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Suryapet : విద్యుత్ షాక్తో ఒక్క రోజే ఇద్దరు మృతి..!
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలో వరుస విద్యుత్ ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు విద్యుత్ సరఫరాలో లోపాలు, మరోవైపు నిర్లక్ష్యంగా ఉన్న విద్యుత్ లైన్లు ప్రాణాలు తీస్తుండటంతో మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే గుంజలూరు గ్రామంలో ఒక మహిళ విద్యుత్ షాక్ తో మృతి చెందిన విషయం మర్చిపోకముందే ఇటీవల భారీ విద్యుత్ సమస్యతో సుమారు 40 మోటార్లు దగ్ధమై రైతులకు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ఆ ఘటన మర్చిపోకముందే మండలంలో మరో రెండు విషాదాలు చోటుచేసుకోవడం కలకలం రేపింది.
వాల్య తండాకు చెందిన ధారావత్ అనూష అనే యువతి ఉదయం ఇంటి వద్ద బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యులు కళ్లముందే ఆమె ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అదే రోజు కోమటికుంట గ్రామానికి చెందిన పిట్టల దినేష్ తన సోదరి వివాహ పనుల్లో బిజీగా ఉండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలింది.
వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పెళ్లి ఇంట్లో ఆనందం ఒక్కసారిగా విషాదంగా మారింది.
ఒక్కరోజే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో చివ్వేంల మండల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రమాదాలకు కారణమవుతున్న లోపాలను సరిచేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఘటనలపై కేసులు నమోదు చేసుకున్న చివ్వేంల ఎస్సై మహేశ్వర్ దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి :
- Miryalaguda : హైడ్రాను విస్తరించేందుకు నిర్ణయం.. మిర్యాలగూడలో హైడ్రా కమిషనర్ పర్యటన..!
- అధికారుల ఆదేశాలు బేఖాతర్.. నిబంధనలకు విరుద్ధంగా కల్వర్టులోకి పైపు లైన్..!
- Miryalaguda : రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు..!
- TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెవెన్యూ శాఖలో భారీ బదిలీలు..!
- TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెవెన్యూ శాఖలో భారీ బదిలీలు..!