Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో ప్రతిభ చాటిన తల్లి కూతుళ్లు..!

22 దేశాల నుండి 2000 మంది కీబోర్డ్ కళాకారులు ఆధ్వర్యంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శనలో జిల్లా కేంద్రానికి చెందిన తల్లి కూతుర్లు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.

Suryapet : గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో ప్రతిభ చాటిన తల్లి కూతుళ్లు..!

సూర్యాపేట, మనసాక్షి :

22 దేశాల నుండి 2000 మంది కీబోర్డ్ కళాకారులు ఆధ్వర్యంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శనలో జిల్లా కేంద్రానికి చెందిన తల్లి కూతుర్లు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.

శుక్రవారం హైదరాబాదులోని గచ్చిబౌలి లోగల విక్టరీ ఆడిటోరియంలో గిన్నిస్ అచ్చివర్స్ మీట్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డులో పోటీలు ప్రతిభ కనబరిచిన పట్టణానికి చెందిన ఆదిముల్ల సంధ్య ఆమె చిన్న కూతురు జెస్సికా కు ఆ సంస్థ వ్యవస్థాపకులు ఆగస్టిన్ దండంగి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, సర్టిఫికెట్ అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఫిబ్రవరి రెండో తారీఖున 22 దేశాల నుండి 2000మంది కీబోర్డ్ వాయిదా కారులు ప్రతిభ చూపగా 777 మంది కళాకారుల్ని ఎంపిక చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతిభను వెలికి తీసేలా హల్లెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయం అన్నారు.

ప్రతిభను ప్రోత్సహించేలా సహకరించిన భర్త( ఏ సి టి ఓ) ఆదిముల్ల వెంకటేశం సహకారం ఎంతో ఉందని ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు బంధువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డులు బాధ్యతను పెంచడంతోపాటు ఉత్సాహాన్ని ఇస్తున్నాయని భవిష్యత్తులో మరింత ప్రతిభ కనబరిచేలా ప్రేరణ పొందుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జెస్సికా సంధ్య లకు పట్టణ ప్రముఖులు ప్రతి ఒక్కరు అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు