Nalgonda : నల్గొండ జిల్లాలో రైతు ఆత్మహత్య..!
గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, మనస్తాపంతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో చోటుచేసుకుంది.

Nalgonda : నల్గొండ జిల్లాలో రైతు ఆత్మహత్య..!
గుర్రంపోడు, మన సాక్షి :
గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, మనస్తాపంతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. కొప్పోలు గ్రామానికి చెందిన కన్నెబోయిన సైదులు (35) వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. గత రెండేళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.
ఎన్ని మందులు వాడినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు.ఈ క్రమంలో గత నెల 30న మధ్యాహ్నం తన చేను వద్దకు వెళ్లిన సైదులు.. బెండ తోట కోసం తెచ్చిన పురుగుల మందు తాగాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే నల్లగొండ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 11:40 గంటలకు పరిస్థితి విషమించి మృతి చెందాడు.కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న సైదులు మరణించడంతో భార్య పద్మ, ఇద్దరు కుమారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి కుమారుల్లో ఒకరు ఎనిమిదో తరగతి, మరొకరు ఏడో తరగతి చదువుతున్నారు.
తండ్రి మరణంతో ఆ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడి భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకన్న పేర్కొన్నారు.









