TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
Hyderabad : గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్న తల్లి, కొడుకు..!
మల్కాజిగిరి ఆనంద్ భాగ్ కు చెందిన తల్లీ, కుమారుడు కీ-బోర్డు వాయించడంలో ప్రతిభ చూపి గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చోటు సంపాదించుకున్నారు.

Hyderabad : గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్న తల్లి, కొడుకు..!
నాచారం, మన సాక్షి:
మల్కాజిగిరి ఆనంద్ భాగ్ కు చెందిన తల్లీ, కుమారుడు కీ-బోర్డు వాయించడంలో
ప్రతిభ చూపి గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చోటు సంపాదించుకున్నారు. ఎవిలిన్ గీత గృహిణి.. ఆమె కుమారుడు జోయల్ లెమ్యూల్ మేల్కండ నాలుగో తరగతి చదువుతున్నాడు. వీరిద్దరూ స్థానికంగా ఉన్న ఓ మ్యూజిక్ స్కూల్లో కీబోర్డు వాయించడంలో శిక్షణ పొందుతున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 2న సికింద్రాబాద్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు 22 దేశాలకు చెందిన 2 వేల మందికి కీ-బోర్డు వాయించడంపై పోటీ నిర్వహించారు. ఇందులో 777 మంది ఉత్తమ ప్రతిభావంతులను ఎంపిక చేశారు. వారికి ఇటీవల గచ్చిబౌలిలోని విక్టరీ ఆడిటోరియంలో నిర్వహించిన ‘గిన్నిస్ అచీవర్స్ మీట్ లో ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
ఇవి కూడా చదవండి :
- Miryalaguda : మిర్యాలగూడలో అర్ధరాత్రి ఘోరం.. ముగ్గురు సజీవ దహనం.. ఉలిక్కిపడిన మిర్యాలగూడ..!
- BREAKING : నారాయణపేట జిల్లా కేంద్రంలో మురుగు కాలువలో బాలుడి మృతదేహం లభ్యం..!
- Good News : తెలంగాణలో ఉపాధ్యాయులకు భారీ శుభవార్త.. విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్..!
- మృగశిర కార్తెలో ఏ పంటలు సాగు చేయాలి.. ఏవి సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందంటే..!









