CM Revanth Reddy : రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ.. ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే..!
హైదరాబాదులోని మియాపూర్ చౌరస్తా ఫ్లైఓవర్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ప్రధాన కార్యాలయం ఇతర అభివృద్ధి పనులకు నెల 8వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.

CM Revanth Reddy : రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ.. ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే..!
శేరిలింగంపల్లి, మన సాక్షి :
హైదరాబాదులోని మియాపూర్ చౌరస్తా ఫ్లైఓవర్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ప్రధాన కార్యాలయం ఇతర అభివృద్ధి పనులకు నెల 8వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. నేపథ్యంలో సభా ప్రాంగణం, శంకుస్థాపన స్థల ఏర్పాట్లను ఎమ్మెల్యే గాంధీ డీసీ బాలకృష్ణ , డీసీ సేవా ఇస్లావాత్ , తాజా మాజీ కార్పోరేట్లర్లు, ప్రాజెక్ట్స్, సీఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రూ.530 కోట్ల అంచనా వ్యయంతో మియాపూర్ చౌరస్తా నుండి ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు నిర్మించనున్న ఫ్లైఓవర్, అండర్‌పాస్‌లతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఇంజినీరింగ్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.









