Nalgonda : నల్గొండలో దారుణం.. తండ్రి, కొడుకులు మృతి..!
నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తండ్రి, కొడుకులు మృతి చెందారు.

Nalgonda : నల్గొండలో దారుణం.. తండ్రి, కొడుకులు మృతి..!
నల్గొండ ప్రతినిధి, మన సాక్షి, :
నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తండ్రి, కొడుకులు మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. నల్గొండ మండలం అప్పాజీపేట గ్రామానికి చెందిన పబ్బతిరెడ్డి లింగారెడ్డి (44) విద్యుత్ శాఖలో పని చేస్తూ నల్లగొండలోని దేవరకొండ రోడ్డులో కనకదుర్గ కాలనీలో నివాసం ఉంటున్నారు.
అతని భార్య కవిత హైదరాబాదులో ఇంటర్ చదువుతున్న పెద్ద కుమారుడు ప్రశాంత్ రెడ్డి ని చూసేందుకు సోమవారం ఉదయం వెళ్ళింది. కాగా లింగారెడ్డి తన స్వగ్రామమైన అప్పాజీపేటకు వెళ్లారు. తిరిగి సాయంత్రం ఇంటికి లింగారెడ్డి భార్య కవిత హైదరాబాదు నుంచి వచ్చేవరకు ఇంటిలో లింగారెడ్డి, చిన్న కుమారుడు ప్రణీత్ రెడ్డి (14)ఇద్దరు మృతి చెంది ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
కాగా ప్రణీత్ రెడ్డి తలపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో కొడుకును హత్య చేసి తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానికులు భావిస్తున్నారు. కాగా మృతుడి తండ్రి సత్తిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.









