Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Paddy : ఆ ఎనిమిది రకాల వరి వంగడాలకే డిమాండ్.. రైతులు వాటినే సాగు చేయాలి..!

రైతులు డిమాండ్ ఉన్న వరి వంగడాలనే సాగు చేయాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న మేలురకం వరి సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు.

Paddy : ఆ ఎనిమిది రకాల వరి వంగడాలకే డిమాండ్.. రైతులు వాటినే సాగు చేయాలి..!

హైదరాబాద్, మన సాక్షి :

రైతులు డిమాండ్ ఉన్న వరి వంగడాలనే సాగు చేయాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న మేలురకం వరి సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ డిమాండ్ ఉన్న వరి రకాలను సాగు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. 8 రకాల వరి వంగడాలకు ఉన్నట్లు వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. డిమాండ్ ఉన్న వరి వంగడాలను సాగు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు ధాన్యం కొనుగోలు, నిలువల సదుపాయాలపై, వానాకాలం సాగుపై క్యాబినెట్ సబ్ కమిటీ సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు ఉన్నారు. అయితే ఎగుమతులకు అనుకూలంగా ఉన్న ఆ 8 రకాల వరి వంగడాలను రైతులు ఎక్కువగా సాగు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆ 8 రకాల వరి వంగడాలు ఇవే :

8 రకాల వరి వంగడాలలో ఎగుమతులకు అనుకూలమైన వాటిలో బిపిటి (5204), తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048), కే ఎన్ ఎం 1638, జైశ్రీరామ్, హెచ్ఎంటి, డబ్ల్యూ.జి.ఎల్ 962, డబ్లు జి ఎల్ 44, జెజిఎల్ 1798. రకాల వరి వంగడాలను రైతులు సాగు చేయాలని సూచించారు.
ఈ రకాల వరి వంగడాలను రైతులు సాగు చేస్తే మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంటుందని పేర్కొంటున్నారు.

ఇతర దేశాల్లో డిమాండ్ :

అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలలో ఈ రకాల బియ్యానికి విపరీతమైన ఆదరణ ఉందని వీటిని సాగు చేస్తే రైతులు లాభదాయకంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రకాల వరి వంగడాలను సాగు చేస్తే మద్దతు ధర కంటే కూడా ఎక్కువగా పొందే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా వీటిని సాగు చేస్తే మిల్లర్లు నేరుగా రైతుల వద్దకే వచ్చి కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. రైతులు ఈ వానకాలం సీజన్ నుంచే ఆయా రకాల వరి రకాలను సాగు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచించారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు