Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణరాజకీయం

TS News : చేయూత పింఛన్లపై తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. దరఖాస్తుల స్వీకరణ..!

చేయూత పింఛన్లపై తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మందికి కొత్త పింఛన్లు అందించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.

TS News : చేయూత పింఛన్లపై తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. దరఖాస్తుల స్వీకరణ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

చేయూత పింఛన్లపై తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మందికి కొత్త పింఛన్లు అందించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూతనివ్వాలని తెలంగాణ ప్రభుత్వం జూలై మాసంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. నూతన దరఖాస్తులకు అర్హులైన వారంతా దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న పింఛన్ల సర్వే ఈనెలాఖరు పూర్తికానున్నది. పింఛన్ల సర్వేలో అనర్హులను తొలగించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల మంది చేయూత పింఛన్లు అందుకుంటున్నారు. ఇప్పటికే సర్వేలో అనేక విషయాలు వెలుగు చూశాయి. చనిపోయిన వారు సైతం 40,751 మంది పింఛన్లు తీసుకుంటున్నట్లు తేలింది. అదేవిధంగా 93623 మందిని అమర్హులుగా గుర్తించారు. 41,689 మంది పింఛన్దారుల అడ్రస్ లు కూడా తెలియలేదు. 4 వేల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు, మరో పదకొండు వేలమంది ఆధార్ లింకు లేకపోవడం అధికారులు గుర్తించారు.

ఏది ఏమైనా ఈ నెలాఖరు వరకు సర్వేను పూర్తి చేసి వచ్చే నెలలో కొత్త దరఖాస్తులను స్వీకరించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు కొత్త దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లను చేస్తున్నారు. అర్హులైన వారందరికీ చేయూత అందించాలని ప్రభుత్వ లక్ష్యం అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు