Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలు
Power Cut : కరీంనగర్‌లో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత.. వేళలు ఇవే..!
కరీంనగర్ గ్రామీణ ప్రాంత పరిధిలోని రేకుర్తి 132 కేవీ సబ్-స్టేషన్‌లో అత్యవసర నిర్వహణ పనుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.

Power Cut : కరీంనగర్‌లో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత.. వేళలు ఇవే..!
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ గ్రామీణ ప్రాంత పరిధిలోని రేకుర్తి 132 కేవీ సబ్-స్టేషన్‌లో అత్యవసర నిర్వహణ పనుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు నాలుగు గంటల పాటు ఈ కరెంట్ కోత ఉంటుందని విద్యుత్ శాఖ రూరల్ ఏడీఈ గడం రఘు ఒక ప్రకటనలో తెలిపారు.
దీనివల్ల రేకుర్తి, ఐ హాస్పిటల్ పరిసర ప్రాంతాలు, ఇందిరమ్మ కాలనీ, స్వామి కాలనీ, శేఖభి కాలనీ, సీతారాంపూర్, జగిత్యాల రోడ్, ఆర్టీసీ కాలనీ, గౌడ్స్ కాలనీ మరియు సమ్మక్క గద్దెలు వంటి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. కాబట్టి ఆయా ప్రాంతాల వినియోగదారులు ఈ సమయాల్లో సిబ్బందికి సహకరించి, ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు కోరారు.









