108 అంబులెన్స్ సేవలు ఆకస్మిక తనిఖీ..!
అత్యవసర 108, 102 అమ్మఒడి సేవల పనితీరును పరిశీలించేందుకు నల్గొండ జిల్లా ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ప్రదీప్ కుమార్ శనివారం శాలిగౌరారంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

108 అంబులెన్స్ సేవలు ఆకస్మిక తనిఖీ..!
శాలిగౌరారం, మనసాక్షి :
అత్యవసర 108, 102 అమ్మఒడి సేవల పనితీరును పరిశీలించేందుకు నల్గొండ జిల్లా ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ప్రదీప్ కుమార్ శనివారం శాలిగౌరారంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ముందుగా శాలిగౌరారం 108 అంబులెన్స్‌ను తనిఖీ చేసిన ఆయన వాహనంలోని అత్యవసర మందులు, వైద్య పరికరాలు, స్టాక్ రిజిస్టర్లు, కేసు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
మండల పరిధి నుండి వచ్చే ఎమర్జెన్సీ కేసుల వివరాలను ఈఎంటి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంబులెన్స్‌లో రోగులకు అందించే ప్రథమ చికిత్సపై సిబ్బంది చూపిస్తున్న చొరవను అభినందించారు. అనంతరం శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్ సూర్యశిల్ప తో సమావేశమయ్యారు. ప్రెగ్నెన్సీ కేసులు, పీడియాట్రిక్ ఎమర్జెన్సీలు, పాముకాటు, రోడ్డు ప్రమాదాలు, పాయిజన్ కేసుల్లో 108 సేవలను వెంటనే వినియోగించుకోవాలని సూచించారు.
102 అమ్మఒడి అంబులెన్స్ ద్వారా గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న ఉచిత రవాణా సేవల గురించి చర్చించారు. మండలంలోని గర్భిణీలు, బాలింతలు రెగ్యులర్ చెకప్‌ల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి రావడానికి మరియు సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి 102 సేవలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో శాలిగౌరారం 108 అంబులెన్స్ ఈఎంటి రమేష్, హేమంత్, పైలెట్లు సమీర్, యాదగిరి, 102 కెప్టెన్ బోడిగే రమేష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.









