Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దికరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

Karimnagar : రూ.20 లక్షలతో మంచినీటి పైప్‌లైన్‌ పనులకు శంకుస్థాపన..!

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్ లో మంచినీటి పైప్‌లైన్ పనుల కోసం రేకుర్తి మెయిన్ రోడ్డు వద్ద సోమవారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ లతో కలసి భూమిపూజ నిర్వహించి, శంకుస్థాపన చేశారు.

Karimnagar : రూ.20 లక్షలతో మంచినీటి పైప్‌లైన్‌ పనులకు శంకుస్థాపన..!

కరీంనగర్, మనసాక్షి :

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్ లో మంచినీటి పైప్‌లైన్ పనుల కోసం రేకుర్తి మెయిన్ రోడ్డు వద్ద సోమవారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ లతో కలసి భూమిపూజ నిర్వహించి, శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనుల కోసం కరీంనగర్ నగరపాలక సంస్థకు చెందిన 15వ ఆర్థిక సంఘం మున్సిపల్ నిధుల నుంచి రూ. 20 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ వేగంగా విస్తరిస్తున్న నగర అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీటిని అందించడమే నగరపాలక సంస్థ లక్ష్యమని తెలిపారు.

రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి రాజీ ఉండదని నగర సమగ్రాభివృద్ధికి నిధుల కొరత లేదని, అన్ని డివిజన్లను సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. మంచినీటి పైప్‌లైన్‌ నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకుండా, నిబంధనల ప్రకారం వేగంగా పూర్తి చేసి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డ్యూప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక 19వ డివిజన్ కార్పొరేటర్ సుదగోని మాధవి-కృష్ణా గౌడ్ మరియు 20వ డివిజన్ కార్పొరేటర్ పర్వతం మల్లేషం, 45వ డివిజన్ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ- శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ తుల బాలయ్య, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, డివిజన్ ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు