Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసూర్యాపేట జిల్లా
ఉద్యాన శాఖ అధికారి నర్సరీ యజమానులకు కీలక ఆదేశం..!
సూర్యాపేట జిల్లాలో నారు విక్రయించే నర్సరీ యజమానులు నాణ్యమైన విత్తనాలను వినియోగించి రైతులకు నాణ్యమైన నారు అందజేయాలనీ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య అన్నారు.

ఉద్యాన శాఖ అధికారి నర్సరీ యజమానులకు కీలక ఆదేశం..!
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట జిల్లాలో నారు విక్రయించే నర్సరీ యజమానులు నాణ్యమైన విత్తనాలను వినియోగించి రైతులకు నాణ్యమైన నారు అందజేయాలనీ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య అన్నారు.
బుధవారం సూర్యాపేట మండలం గాంధీనగర్ లో నెట్ హౌస్ లలో నారు పెంచుతున్న నర్సరీని సందర్శించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మిరప, కూరగాయలు, బంతి నారు నర్సరీ అమ్మే యజమానులు ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొందాలని అన్నారు. నాణ్యతలేని విత్తనాలతో నారు పెంచి విక్రయించవద్దని అలా చేసినట్లయితే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని అన్నారు.
నాణ్యతలేని నారు విక్రయించి రైతులను ఆర్థికంగా నష్టపరిచే నర్సరీ యజమానుల పైన ప్రభుత్వ వరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమం లో ఉద్యాన విస్తరణ అధికారి. యారాల సుధాకర్ రెడ్డి, నర్సరీ యాజమాని అబ్దుల్ రహమాన్ ఉన్నారు.
MOST READ :