Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్తెలంగాణ

Srisailam : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి.. ఇన్ ఫ్లో 79,403 క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!

కృష్ణానది ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల వల్ల కర్ణాటక తోపాటు శ్రీశైలం ఎగువ భాగంలో ఉన్న ప్రాజెక్టులన్ని నిండుకుండలా మారాయి.

Srisailam : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి.. ఇన్ ఫ్లో 79,403 క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

కృష్ణానది ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల వల్ల కర్ణాటక తోపాటు శ్రీశైలం ఎగువ భాగంలో ఉన్న ప్రాజెక్టులన్ని నిండుకుండలా మారాయి. దాంతో జూరాల ప్రాజెక్టు నుంచి భారీ వరద నీరు శ్రీశైలం కు వచ్చి చేరుతుంది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో పది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 79,403 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.

దాంతో శ్రీశైలం పూర్తిస్థాయి జలాశయ నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 825 అడుగులకు చేరింది. వరద ఉధృతి ఇదే స్థాయిలో కొనసాగితే శ్రీశైలం నిండుకుండలా మారే అవకాశాలు ఉన్నాయి. భారీ వరద ఉధృతి వస్తున్నప్పటికీ కూడా కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు.

MOST READ : 

మరిన్ని వార్తలు