Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్తెలంగాణ

Srisailam : శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. లేటెస్ట్ అప్డేట్..!

కృష్ణా నది ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ఎగువనున్న ప్రాజెక్టులన్ని నిండుకుండలా మారాయి. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆలమట్టి డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Srisailam : శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

కృష్ణా నది ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ఎగువనున్న ప్రాజెక్టులన్ని నిండుకుండలా మారాయి. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆలమట్టి డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం పెరుగుతుంది.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఒక లక్ష క్యూసెక్కులకు నీరు నేరుగా చేరుతుంది. ఆల్మట్టి డ్యామ్ నుంచి 90 వేల క్యూసెక్కుల నీరు, భీమా నది నుంచి పదివేల క్యూసెక్కుల నీళ్లు కృష్ణా నదిలోకి వదులుతున్నారు. జూరాల జల విద్యుత్ కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. దాంతో శ్రీశైలం జలాశయానికి ఒక లక్ష క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.

మరో నాలుగు, ఐదు రోజులు భారీ వర్షాలు కురిస్తే శ్రీశైలం జలాశయానికి రెండు నుంచి మూడు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. శ్రీశైలం జలాశంలోకి భారీగా వరద నీరు చేరడంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తే నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నీరు చేరే అవకాశం ఉంది.

MOST READ 

మరిన్ని వార్తలు