Viral : రైతు సాహసం.. మొసలిని భుజంపై మోస్తూ పోలీస్ స్టేషన్ కు.. వీడియో వైరల్..!
ఓ రైతు సాహసం చేశారు. దానిని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. పొలంలోకి వచ్చిన మొసలిని ఏమాత్రం భయం లేకుండా దానిని భుజాలపై మూసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు.

Viral : రైతు సాహసం.. మొసలిని భుజంపై మోస్తూ పోలీస్ స్టేషన్ కు.. వీడియో వైరల్..!
మన సాక్షి :
ఓ రైతు సాహసం చేశారు. దానిని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. పొలంలోకి వచ్చిన మొసలిని ఏమాత్రం భయం లేకుండా దానిని భుజాలపై మూసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. ఈ ఆశ్చర్యకర సంఘటన బీహార్ లోని సుఫౌల్ జిల్లాలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి.
సుఫౌల్ జిల్లాలోని ఓ గ్రామంలో రైతు పొలంలో పనిచేస్తుండగా పొలం మధ్యలో దాగి ఉన్న ఐదు అడుగుల మొసలిని గమనించాడు. సాధారణంగా ఇలాంటి సందర్భాలలో ప్రతి ఒక్కరు కూడా భయపడుతుంటారు. వాటిపై దాడి చేస్తారు. అయితే అమిత్ కుమార్ అనే రైతు దానిని తోటి రైతుల సహాయంతో మొసలి పై దాడి చేయకుండా నోటిని తాడుతో కట్టేశాడు. ఆ తర్వాత ఐదు అడుగుల మేర ఉన్న ఆ మొసలిని భుజాలపై మోసుకొని అటవీశాఖ అధికారుల కార్యాలయానికి బయలుదేరాడు.
అక్కడ అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో అలాగే నడుచుకుంటూ భీమ్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అక్కడికి అటవీ శాఖ సిబ్బంది చేరుకొని మొసలిని తమ ఆధీనంలోకి తీసుకొని నదిలోకి విడిచిపెట్టారు.
Viral News :
- Viral Video : మహబూబాబాద్ లో వింత ఘటన.. గుండుతో ఉంటే గుర్తించని ఉపాధి హామీ సాఫ్ట్ వేర్.. (వీడియో )
- Viral News : 10 గంటల పాటు డిజిటల్ అరెస్ట్.. భయంతో తల్లిదండ్రులు, 8వ తరగతి బాలుడు మాస్టర్ ప్లాన్..!
- Viral Video : తండ్రిని గోనె బస్తాలో కుక్కి కొరియర్ ఆఫీసుకు తీసుకెళ్లిన కూతురు.. (వీడియో)
- Viral Video : రెండు నెలల క్రితం వివాహం.. సెల్ఫీ దిగుదామని భర్తను నది ఒడ్డుకు తీసుకెళ్లిన భార్య.. (వీడియో)









