Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ

Srisailam : శ్రీశైలం నిండకముందే ఏపీకి నీటి తరలింపు.. మరి సాగర్ పరిస్థితి..!

కృష్ణానది ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

Srisailam : శ్రీశైలం నిండకముందే ఏపీకి నీటి తరలింపు.. మరి సాగర్ పరిస్థితి..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

కృష్ణానది ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కాగా శ్రీశైలం ప్రాజెక్టు నిండకముందే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు నీటిని విడుదల చేశారు. గురువారం ఉదయం నుంచే పోతిరెడ్డిపాడుకు చెందిన ఐదు, ఆరవ నెంబర్ గేట్లు ఎత్తి ఎస్ఆర్బిసి, తెలుగు గంగా ప్రాజెక్టుల ఆయకట్టుకు 4000 క్యూసెక్కులను విడుదల చేశారు. తాగునీటి పేరుతో సాగునీటికి కూడా విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు రెండవ వారం తర్వాత ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గి వరదలు తగ్గే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు విద్యుత్ ఉత్పాదన చేసి విడుదల చేయాల్సి ఉంది అయినా కూడా శ్రీశైలం నిండక ముందే ఏపీకి నీటిని తరలిస్తున్నారు. కృష్ణ బోర్డు చైర్మన్, ఏపీ జలవనురుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మూడు రోజుల క్రితమే తక్కువ వర్షపాతం నమోదయితుందని ప్రాజెక్టుల నుంచి నీటిని తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ లేఖలో పేర్కొనడం గమనార్హం.

శ్రీశైలం ప్రాజెక్టులోకి వరదలు వస్తున్నప్పటికీ కూడా సాగర్ జలాశంలోకి ఇప్పటివరకు చుక్క నీరు కూడా చేరుకోలేదు. వరదలు తగ్గుముఖం పట్టి శ్రీశైలంలో ఉన్న నీరు పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ తరలించకపోతే నాగార్జునసాగర్ పరిస్థితి ఏంటని తెలంగాణలో రైతులు ఆందోళన చెందుతున్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు