Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఉద్యోగంతెలంగాణ

TS News : ఓకే ఉద్యోగి రెండు చోట్ల జీతాలు.. అక్రమార్కుల గుట్టురట్టు..!

ఒకే ఉద్యోగి రెండు చోట్ల జీతాలు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.

TS News : ఓకే ఉద్యోగి రెండు చోట్ల జీతాలు.. అక్రమార్కుల గుట్టురట్టు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

ఒకే ఉద్యోగి రెండు చోట్ల జీతాలు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా 40 మంది ఉద్యోగులు రెండుచోట్ల జీతాలు తీసుకుంటున్న విషయం బయటకి వచ్చింది. వెంటనే చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు సర్కులర్ జారీ చేశారు. తీసుకున్న వేతనం రికవరీ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా ఆదేశాలు జారీచేశారు.

ఓకే ఆధారిత ఐడెంటి ద్వారా వేర్వేరు ప్రభుత్వ శాఖల నుంచి ఇద్దరు వ్యక్తులు లేదా ఒకే వ్యక్తి రెండు చోట్ల అక్రమంగా వేతనాలు పొందుతున్నట్లు ఆర్థిక శాఖ గుర్తించింది. పాఠశాల విద్యా, పంచాయతీరాజ్, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో సుమారుగా 40 మంది అక్రమాలకు తెరలేపారు. రెండేసి జీతాలు తీసుకుంటూ ఓకే ఉద్యోగం చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

అయితే ఈ చర్య తీవ్రమైన ఆర్థిక అక్రమాలుగా గుర్తిస్తూ అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం సర్కులర్ విడుదల చేసింది. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అక్రమంగా జీతాలు కాజేసిన వారిపై చట్టపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజూ అన్ని శాఖ ఆధిపతులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

తప్పుడు సమాచారం ఇవ్వడం అసలు విషయాలను దాచి పెట్టి ఫోర్జరీ చేసి ప్రభుత్వాన్ని నిధులు దుర్వినియోగానికి పాల్పడిన వారిపై తెలంగాణ సివిల్ సర్వీస్ రూల్స్ 1991 ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అక్రమంగా పొందిన జీతం మొత్తం తో పాటు వడ్డీతో సహా రికవరీ చేయాలని, బాధ్యులైన అధికారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

దీనిని ప్రభుత్వం అత్యంత తీవ్రమైన ఆర్థిక నేరంగా పరిగణిస్తూ జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు పంపింది. ఆర్థిక శాఖ విడుదల చేసిన అక్రమార్కుల చిట్టాలో అత్యధికంగా పోలీసు శాఖ పరిధిలోనే 17 మంది రెండేసి జీతాలు తీసుకుంటున్నట్లు కేసులు నమోదయ్యాయి.

అక్రమార్కుల గుట్టు ఓకే ఆధారిత మ్యాపింగ్ లేదా వేర్వేరు ఉద్యోగి కోడ్ లతో ఐ ఎఫ్ ఎం ఐ ఎస్ పోర్టల్ తో అక్రమంగా వేతనాలు పొందుతున్న ఉద్యోగుల జాబితా బయటపడింది.

MOST READ : 

మరిన్ని వార్తలు