Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
viralBreaking Newsఆంధ్రప్రదేశ్తెలంగాణసినిమా

Viral : అన్నయ్య అనే పిలుపు కోసం ఎదురుచూస్తున్న బ్రహ్మానందం తోబుట్టు..!

వృద్ధాప్యంలో అన్నయ్య అనే పిలుపు కోసం సినీ నటుడు బ్రహ్మానందం తోబుట్టువు శ్రీ వదన్ ఎదురుచూస్తున్నారు. ఈ వీడియో ఎస్ ఎం లో వైరల్ గా మారింది.

Viral : అన్నయ్య అనే పిలుపు కోసం ఎదురుచూస్తున్న బ్రహ్మానందం తోబుట్టు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

వృద్ధాప్యంలో అన్నయ్య అనే పిలుపు కోసం సినీ నటుడు బ్రహ్మానందం తోబుట్టువు శ్రీ వదన్ ఎదురుచూస్తున్నారు. ఈ వీడియో ఎస్ ఎం లో వైరల్ గా మారింది. తనకు ఎలాంటి డబ్బు అవసరం లేదని, కేవలం పిలుపు కోసమే చూస్తున్నట్లు ఆయన వీడియోలో పేర్కొన్నారు. బ్రహ్మంగారి దేవాలయంలో పూజారిగా తాను పనిచేస్తున్నానని, గతంలో తాను కూడా నాటకాలు వేసినట్లు చెప్పారు.

తమ తల్లిదండ్రులకు ఆరుగురు సంతానం కాగా నలుగురు చనిపోయారని, ఇప్పుడు ఇద్దరం మాత్రమే ఉన్నామని ఆయన పేర్కొన్నారు. గొప్పవాళ్లు పలకరిస్తే సంతోషంగా ఉంటుందని చెప్పాడు. ఎప్పుడైనా ఎలా ఉన్నావురా అని పలకరిస్తాడేమోనని ఎదురుచూస్తున్నట్లు శ్రీవదన్ తెలిపారు. ఇటీవల తమ ఊరికి వచ్చినప్పటికీ పలకరిస్తాడని ఎదురు చూసినా కూడా పలకరించలేదని శ్రీ వధన్ తెలియజేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral News : 

మరిన్ని వార్తలు