టీచర్ మందలింపుతో ఆరేళ్ల విద్యార్థి మృతి..!
పాఠశాలలో టీచర్ మందలించడంతో ఆరేళ్ల విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటు చేసుకుంది.

టీచర్ మందలింపుతో ఆరేళ్ల విద్యార్థి మృతి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
పాఠశాలలో టీచర్ మందలించడంతో ఆరేళ్ల విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం…
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థి రోజు మాదిరిగానే పాఠశాలకు వెళ్లాడు. హోంవర్క్ చేయకపోవడంతో విద్యార్థి వినయ్ తేజ్ ను టీచర్ మందలించింది. ఇది జరిగిన కొద్దిసేపటికే విద్యార్థి గుక్కపెట్టి ఏడుచుతూ కుప్పకూలి పోయాడు. టీచర్ ఒడిలోనే పడిపోగా వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే విద్యార్థి వినయ్ తేజ్ మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు హుటాహుటిన స్కూలుకు వెళ్లారు. బోరున విలపించారు. టీచర్ కొట్టడం వల్లనే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపించారు. పాఠశాల వద్ద ఆందోళన చేశారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దాంతో పోలీసులు టీచర్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- జూరాలకు మళ్లీ వరద.. గేట్లు ఎత్తి విడుదల, శ్రీశైలంకు చేరుతున్న నీరు..!
- Nalgonda : ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో.. వెలుగులోకి సంచలన నిజాలు..!
- Nagarjunasagar : నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద.. లేటెస్ట్ అప్డేట్..!
- BIG BREAKING : ఏసీబీకి చిక్కిన ఉత్తమ అధికారి, ఆత్మహత్య చేసుకున్న ట్రైనీ డిప్యూటీ తాసిల్దార్.. మరెన్నో బ్రేకింగ్ న్యూస్ | ManaSakshi









