ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి..!
యువశక్తిపై నమ్మకంతో, సాంకేతిక భారత స్వప్నానికి బాటలు వేసిన మహానాయకడు రాజీవ్ గాంధీకి ఘన నివాళులు డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా అశోక్ టాకీస్ చౌరస్తాలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షులు ఏ. సంజీవ్ ముదిరాజ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి..!
మహబూబ్ నగర్, మన సాక్షి :
యువశక్తిపై నమ్మకంతో, సాంకేతిక భారత స్వప్నానికి బాటలు వేసిన మహానాయకడు రాజీవ్ గాంధీకి ఘన నివాళులు డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా అశోక్ టాకీస్ చౌరస్తాలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షులు ఏ. సంజీవ్ ముదిరాజ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి, కాంగ్రెస్ కలిసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ ఆధునిక భారత నిర్మాణానికి బలమైన పునాదులు వేసిన దూరదృష్టి కలిగిన నాయకులు. దేశంలో సాంకేతిక, సమాచార విప్లవానికి నాంది పలికి, యువతకు కొత్త అవకాశాలను కల్పించారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన ఆశయాలు, దేశ అభివృద్ధి కోసం చేసిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని అన్నారు.
ఈకార్యక్రమంలో మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు బెక్కరి మధుసూదన్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీలు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, సాయిబాబా, ధోమ పరమేష్, కలీం, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, ప్రతాప్ గౌడ్, మీడియా సెల్ సీజే బెనహర్, కార్పొరేటర్ సీజే పూజిత, అవేజ్, గులాం జహీర్,
ఎంపీ ప్రవీణ్ కుమార్,మండల అధ్యక్షులు మహేందర్, లక్ష్మారెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత, జిల్లా మత్స్యశాఖ అధ్యక్షులు గోనెల శ్రీనివాస్, టీసీ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లా, కంచిమి లక్ష్మణ్, కోటల చంద్రయ్య, మురళీ గౌడ్, రియాజుద్దీన్, అబ్రార్, హరినాథ్, వెంకటలక్ష్మి, ఉషారాణి, గంగిరెడ్డి, బసీద్, అక్బర్, గంజి అంజనేయులు, ముస్తాక్ అలీ, ఆశు, జగదీష్, గోపాల్ యాదవ్, పీర్ ఎండీ ఆదిక్, రామచందర్, మాసన్న, కృష్ణయ్య, శేఖర్ రెడ్డి, వినయ్ కుమార్, వడ్ల రాకేష్, గాయకుడు అంజి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.