Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda : నాగార్జునసాగర్ ఎండుతుంటే పోతిరెడ్డిపాడుకు నీటి విడుదల ఎలా.. రోడ్డెక్కిన రైతులు..!

ఎవరి ఆదేశాలతో నాగార్జునసాగర్ కు నీళ్లు రానివ్వకుండా పోతిరెడ్డిపాడు నుంచి 25 వేల క్యూసెక్కుల నీళ్లు ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు.

Nalgonda : నాగార్జునసాగర్ ఎండుతుంటే పోతిరెడ్డిపాడుకు నీటి విడుదల ఎలా.. రోడ్డెక్కిన రైతులు..!

నీళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు ద్రోహం, చేస్తోంది

25 వేల క్యూసెక్కుల నీళ్లు పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తుంటే.. నాగార్జున సాగర్ చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు….

నాగార్జున సాగర్ నిండేంత వరకు పోతిరెడ్డిపాడు నీళ్లు తీసుకొని పోవడానికి వీల్లేదు…. అంటూ రైతుల ధర్నా

చింతపల్లి, మనసాక్షి :

ఎవరి ఆదేశాలతో నాగార్జునసాగర్ కు నీళ్లు రానివ్వకుండా పోతిరెడ్డిపాడు నుంచి 25 వేల క్యూసెక్కుల నీళ్లు ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం పీఏ పల్లి మండలం గణపురం స్టేజ్ సమీపంలోని ఏఎంఆర్‌పీ మెయిన్ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ మెయిన్ గేట్ల వద్ద నిర్వహించిన రైతుల ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

నాగార్జున సాగర్‌కు చుక్క నీరు రాకుండా పోతిరెడ్డిపాడు ద్వారా భారీగా నీటిని తరలిస్తున్నారని ఆయన విమర్శించారు. సుమారు 25 వేల క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడు నుంచి తరలిస్తున్నప్పుడు నాగార్జున సాగర్‌కు నీరు రాకుండా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ నిండేంత వరకు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎవరి ఆదేశాలతో నీటిని తరలిస్తున్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు.ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి సమృద్ధిగా నీరు వస్తున్నప్పటికీ, రైతులకు సాగునీరు అందించడం లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తపరచారు . నాగార్జున సాగర్‌లో నీరు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించేందుకు జిల్లా మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

కేసీఆర్ హయాంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించామని గుర్తుచేశారు. ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రెండు పంటలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు.ఇదే సమయంలో ఏఎంఆర్‌పీ రిజర్వాయర్ నీటిని ముందుగా గుడిపల్లి, పీఏ పల్లి మండలాల్లోని చెరువులు, కుంటలకు అందించి నింపాలని రమావత్ రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు.

ఈ ప్రాంత రైతులు ప్రధానంగా భూగర్భ జలాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయని తెలిపారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలు, పశువులకు సైతం తాగునీటి సమస్య ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

నల్లగొండ పట్టణానికి తాగునీరు అందించే క్రమంలో నీటిని తరలించడంతో పాటు, గుడిపల్లి, పీఏ పల్లి మండలాల్లోని చెరువులు, కుంటలను కూడా తప్పనిసరిగా నింపాలని స్పష్టం చేశారు. స్థానిక రైతాంగం, ప్రజల తాగునీటి అవసరాలను విస్మరించకుండా ముందుగా ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలకు నీటిని అందించాలని కోరారు.

ముందుగా చెరువులు, కుంటలు నింపి స్థానిక రైతాంగాన్ని, ప్రజలను కాపాడాలి అని స్పష్టం చేశారు. ఏఎంఆర్‌పీ రిజర్వాయర్ నీటిని సమర్థవంతంగా వినియోగించి ఈ ప్రాంత రైతులకు సాగునీటి భరోసా కల్పించడంతో పాటు ప్రజలు, పశువులకు తాగునీటి సమస్య లేకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం ఇతర రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు.స్థానిక ఎమ్మెల్యేకు నల్లమట్టి మీద ఉన్న ప్రేమ రైతులపై లేదని
విమర్శించారు. నల్లగొండకు నీటిని తరలిస్తున్నా స్థానిక రైతుల సాగునీటి అవసరాలపై ఎమ్మెల్యే స్పందించకపోవడం బాధాకరమన్నారు.

ప్రభుత్వం వెంటనే నీటి విడుదలపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద రైతులకు సాగునీరు అందించాలని, ఏఎంఆర్‌పీ నీటితో గుడిపల్లి, పీఏ పల్లి మండలాల్లోని చెరువులు, కుంటలను నింపాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్, మండల అధ్యక్షులు వెల్లుగురి వల్లపు రెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కటికనేని మాధవ రావు, తోటకూరి పరమేష్, మాద సుధాకర్ గౌడ్, సర్పంచులు కూన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, రైనబోయిన శ్రీను,నగేష్, రమావత్ కిషన్, అర్వపల్లి నర్సింహ, బొడ్డుపల్లి మహేందర్, దీపావత్ నరేందర్, ఎర్ర యాదగిరి, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు, రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి 

మరిన్ని వార్తలు