Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Miryalaguda : ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య దుర్మార్గమైన చర్య.. ట్రాస్మా అద్వర్యంలో ర్యాలీ..!

కొండమల్లేపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య నిరసిస్తూ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ట్రస్మా ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డిఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

Miryalaguda : ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య దుర్మార్గమైన చర్య.. ట్రాస్మా అద్వర్యంలో ర్యాలీ..!

మిర్యాలగూడ,  మన సాక్షి:

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య నిరసిస్తూ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ట్రస్మా ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డిఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ట్రస్మ నాయకులు మాట్లాడుతూ చదువు నేర్పే ఉపాధ్యాయులను దుర్మార్గంగా 27 కత్తిపోట్లతో హత్య చేయడం సహించరాని నేరమన్నారు. విద్యార్థులలో నేర ప్రవృత్తి పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వాలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అనైతిక కార్యక్రమాలు నివారణకు కౌన్సిలర్లను నియమించి నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు చదువుతోపాటు సామాజిక స్పృహ ఉండే విషయాలు నేర్పించాలని అందుకు ఒక పిరియడ్ కేటాయించాలని సూచించారు. విద్యార్థుల్లో నేర ప్రవృత్తి పెరగడానికి గంజాయి, డ్రగ్స్ వంటి నిషేధిత మత్తు పదార్థాలు కారణాలు అని వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

సినిమాలు ,సీరియల్లో వచ్చే వాటితో పాటు మొబైల్ ఫోన్లు విద్యార్థులు అత్యధికంగా వాడడం వల్ల నైతికత, సామాజిక స్పృహ కోల్పోతున్నారని అన్నారు. సెల్ ఫోన్ వాడకంపై కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాల లోపు విద్యార్థులకు నిషేధం విధించాలని కోరారు. భూపాల్ రెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావడం కాకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేర ప్రవృత్తి నివారణ, అసాంఘిక కార్యక్రమాల నివారణ కోసం పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశాన్ని చేర్చాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ , దేశ రెడ్డి శేఖర్ రెడ్డి ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపి క్యాంప్ గ్రౌండ్ నుంచి దాదాపు ఆర్డిఓ ఆఫీస్ వరకు వారు ర్యాలీలో పాల్గొని సంఘీభావాన్ని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్మా నాయకులు జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి , వంగాల నిరంజన్ రెడ్డి , అలుగువెల్లి శ్రీనివాస్ రెడ్డి, కుందూరు శ్యాంసుందర్ రెడ్డి, అయ్యన్న, శ్రీపతి శ్రీనివాస్ , బొడ్డుపల్లి వరప్రసాద్, ఓరుగంటి శ్యామ్, శ్రీరామ కవచం నాగరాజు, సాయి శ్రీనివాస్, మారుతి అమరేందర్ రెడ్డి, మహమ్మద్, మల్లు రవీందర్ రెడ్డి, కందాల శ్రీనివాసాచారి, అనంతుల సోమయ్య, కందుల మధుసూదన్, రియాజ్ , పెంట రాజు, సైదులు, శ్రీధర్ రెడ్డి, దోనాల రాంరెడ్డి, నీలిమ, చంద్రకళ, అనిత , ఉమా, శ్రీకాంత్ కాన్ , వెంకట్, నర్సిరెడ్డి, చార్లెస్, కలీం, సురేందర్ రెడ్డి పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు