తీవ్ర విషాదం.. కొడుకును కాపాడుకోబోయి తల్లిదండ్రులు మృతి..!
మహారాష్ట్రలో తీవ్ర విషాదఘటన నెలకొన్నది. కొడుకును కాపాడుకోబోయి తల్లిదండ్రులు మృతి చెందారు.

తీవ్ర విషాదం.. కొడుకును కాపాడుకోబోయి తల్లిదండ్రులు మృతి..!
మన సాక్షి, వెబ్ డేస్క్ :
మహారాష్ట్రలో తీవ్ర విషాదఘటన నెలకొన్నది. కొడుకును కాపాడుకోబోయి తల్లిదండ్రులు మృతి చెందారు. ఐఫోన్ కొనివ్వాలనే విషయంలో తల్లిదండ్రులతో గొడవపడ్డ కునాల్ చంద్ గుడే (19 ) ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సమీపంలో ఉన్న కొండ వద్దకు వెళ్లి కొండ చివర నిల్చని కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మురళీధర్, సంగీత అతని వద్దకు వచ్చారు. దాదాపు మూడు గంటల పాటు బ్రతిమిలాడిన వినలేదు. దగ్గరకు వస్తే దూకేస్తానని బెదిరించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. లోయలో కింద వల ఏర్పాటు చేసినా మరో అంచుకు వెళ్లి యువకుడు బెదిరించాడు. కాగా కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో పట్టుకునేందుకు తండ్రి మురళీధర్ వెళ్ళాడు.
కొడుకును పట్టుకునే ప్రయత్నంలో పట్టుతప్పి తండ్రి, కొడుకులు ఇద్దరు కొండపై నుంచి పడి మృతి చెందారు. దాంతో షాక్ కు గురైన తల్లి సంగీత కూడా కొండపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చత్రపతి శివాజీ నగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- Madgulapalli : పది రోజులు మృత్యువుతో పోరాడి.. చివరికి లోకాన్ని విడిచి..!
- TG News : అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు.. కొండ సురేఖకు వ్యతిరేకంగా సమావేశమైన 18 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..!
- ఏకాంతంగా ఉండేందుకు అడవికి వెళ్ళిన జంట.. చివరికి ఏం జరిగిందంటే..!
- జూరాలకు మళ్లీ వరద.. గేట్లు ఎత్తి విడుదల, శ్రీశైలంకు చేరుతున్న నీరు..!









