ACB : రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వాణిజశాఖ అధికారులు..!
50వేల రూపాయలు లంచం తీసుకుంటూ వాణిజ్య శాఖ అధికారులు ఏసీబీకి చిక్కారు.

ACB : రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వాణిజశాఖ అధికారులు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
50వేల రూపాయలు లంచం తీసుకుంటూ వాణిజ్య శాఖ అధికారులు ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని వాణిజ్య శాఖ పన్నుల కార్యాలయంలో చోటుచేసుకుంది. నిర్మల్ పట్టణంలోని వాణిజ్య పనుల శాఖ కార్యాలయంలో ఎస్ టి ఓ గా పనిచేస్తున్న గోదావరి, సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న సాయి కృష్ణ కార్యాలయంలో బాధితుల నుంచి 50 వేల రూపాయల లంచం తీసుకోగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
మంచిర్యాల పట్టణానికి చెందిన ఒక వ్యాపారి శ్రీ లక్ష్మీప్రసన్న జ్యువెలర్స్ కు సంబంధించి 2022 – 23, 2023 – 24 ఆర్థిక సంవత్సరాల సంబంధించిన రికార్డుల ఆడిట్ లో అనుకూలమైన నివేదిక ఇచ్చేందుకు అధికారులు మొదటగా లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారు. కాగా చివరికి 50 వేలకు ఒప్పందం కుదిరింది.
దాంతో లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దాంతో వైసీపీ అధికారులు ఎస్ టి ఓ గోదావరి, సీనియర్ అసిస్టెంట్ సాయి కృష్ణ వ్యాపారి నుండి 50 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
MOST READ









