Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

నల్గొండ జిల్లాలో ఘోరం.. పంది కూర వండలేదని భార్యను చంపిన భర్త..! 

పంది కూర వండలేదని భార్యపై భర్త దాడి చేయడంతో తీవ్ర గాయాలై భార్య మృతి చెందిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి షాబ్దుల్లాపురంలో జరిగింది.

నల్గొండ జిల్లాలో ఘోరం.. పంది కూర వండలేదని భార్యను చంపిన భర్త..! 

కనగల్, మన సాక్షి:

పంది కూర వండలేదని భార్యపై భర్త దాడి చేయడంతో తీవ్ర గాయాలై భార్య మృతి చెందిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి షాబ్దుల్లాపురంలో జరిగింది. కనగల్ ఎస్సై రాజీవ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన కారింగు లింగమ్మ (66)ను పంది కూర వండాలని భర్త లింగయ్య భార్యతో గొడవపడ్డాడు.

అర్ధరాత్రి సమయంలో భార్య లింగమ్మ నిద్రిస్తుండగా పదునైన ఆయుధంతో లింగమ్మపై దాడి చేసి నరికి చంపాడు. చాతి పొట్ట తలపై రక్త గాయాలు కావడంతో లింగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. లింగమ్మపై దాడి చేసి చంపి భర్త అక్కడి నుంచి ఫరారరయ్యాడు. మృతురాలి కూతురు లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు