Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

ఎంబీబీఎస్ లో  ప్రభుత్వ సీటు సాధించిన చింతపల్లి విద్యార్థిని..!

నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని ప్రశాంతపురి తండాకు చెందిన కేతావత్ రుక్మిణి - కిషన్ నాయక్ దంపతుల కుమార్తె శ్రీవాణి వైద్య విద్యలో తన కల నెరవేర్చుకుంది. ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటును సాధించింది.

ఎంబీబీఎస్ లో  ప్రభుత్వ సీటు సాధించిన చింతపల్లి విద్యార్థిని..!

చింతపల్లి, మన సాక్షి

నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని ప్రశాంతపురి తండాకు చెందిన కేతావత్ రుక్మిణి – కిషన్ నాయక్ దంపతుల కుమార్తె శ్రీవాణి వైద్య విద్యలో తన కల నెరవేర్చుకుంది. ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటును సాధించింది. గ్రామీణ నేపథ్యం ఉన్నప్పటికీ శ్రీవాణి చదువులో మొదటినుంచీ ప్రతిభ చాటుతోంది.

6వ తరగతి నుండి 10వ తరగతి వరకు హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో ఉంటూ చదువుకోగా, అనంతరం శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఎంతో క్రమశిక్షణ, పట్టుదలతో కష్టపడి నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ మెడికల్ సీటును కైవసం చేసుకుంది.

సామాన్య గిరిజన కుటుంబం నుండి వచ్చి డాక్టర్ సీటు సాధించిన శ్రీవాణిని, ఆమె తల్లిదండ్రులను గ్రామ ప్రజలు, మండల ప్రముఖులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీవాణి విజయం తండాలోని ఇతర విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు.

మరిన్ని వార్తలు