Breaking Newsఆంధ్రప్రదేశ్పండుగలు
విగ్నేశ్వరునికి ప్రత్యేక పూజలో చమర్తి జగన్ మోహన్ రాజు..!
రాజంపేట పట్టణంలో సోమవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి దొంతం శివప్రసాద్ ఆహ్వానం మేరకు రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు వినాయక మండపాన్ని సందర్శించి విగ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాజంపేట, మనసాక్షి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నాలను తొలగించి విజయపథంలో నడిపించే గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
అంతకుముందు వార్డులో పర్యటించిన చమర్తి జగన్ మోహన్ రాజు ని గణేష్ మండప నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.