రైతు బాంధవుడు కేసీఆర్, – జైపాల్ రెడ్డి
రైతు బాంధవుడు కేసీఆర్, – జైపాల్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా ఆమనగల్, మన సాక్షి : మాడుగుల మండల తెరాస పార్టీ మండల అధ్యక్షుడు ఏమిరెడ్డి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు వానాకాలం పెట్టుబడి సహాయం అందించడం చాలా సంతోషకరమని అన్నారు. రైతులకు,రైతుబంధు మాడుగుల మండలంలోని అత్యధికంగా వస్తుందని సన్నకారు రైతులకు రైతుబంధు ఉపయోగపడుతుందని వాపోయారు, ఇంటికి పెద్దకొడుకు లాగా కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి అండగా ఉంటున్నాడని రైతు సల్లగా ఉంటేనే దేశం బాగుంటుందని రైతే దేశానికి వెన్నుముకని అన్నాడు. గత ప్రభుత్వాలు రైతులను ఆదుకున్న దాఖలు లేవని తెలంగాణ రైతులు జీవితాంతం కేసిఆర్ కు రుణపడి ఉంటారని అన్నారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు అంబల్ల జంగయ్య, సింగిల్ విండో చైర్మన్ తిరుమల్ రెడ్డి,జెల్ల యాదయ్య విజయ డైరీ,మండల యూత్ వింగ్ ప్రెసిడెంట్ కంచర్ల గిరి,తెరాస నాయకుడు రమేష్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
1. ఇంటర్ లో ఫెయిల్, మనస్థాపంతో విద్యార్థి ఆత్మహత్య









