Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం
Miryalaguda : భారీ వర్షం నేలపాలైన వరి.. ఆవేదనలో రైతన్న..!
మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దాంతో ఆరుగాలం కష్టపడి చేతికి వస్తుందనుకున్న పంట నేలపాలైంది.

Miryalaguda : భారీ వర్షం నేలపాలైన వరి.. ఆవేదనలో రైతన్న..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దాంతో ఆరుగాలం కష్టపడి చేతికి వస్తుందనుకున్న పంట నేలపాలైంది. సుమారు రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో వరి పంట నేలకొరిగింది. నియోజకవర్గం వారి కోతలు షురూ అయ్యాయి.
మరో వారం రోజుల్లో పంటలు చేతికి వస్తాయని రైతులు భావించారు. కానీ భారీ వర్షంతో అంతా అతలాకుతలం అయింది. నియోజకవర్గంలో ని చింతపల్లి, జప్తి వీరప్ప గూడెం, గూడూరు, తక్కెళ్ళపాడు, తడక మల్ల, రావులపెంట, తుంగపాడు తో పాటు పలు గ్రామాలలో వరి పంట నేలకొరిగింది.











