Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Uncategorized

జడ్చర్ల మున్సిపాలిటీలో తాగునీటి సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు..!

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో రాబోయే వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో చేపట్టారు.

జడ్చర్ల మున్సిపాలిటీలో తాగునీటి సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు..!

( మహబూబ్ నగర్ జిల్లా – గోపాల్, 
మన సాక్షి )

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో రాబోయే వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో చేపట్టారు. బుధవారం మధుసూదన్ నాయక్, మహబూబ్‌నగర్ , జడ్చర్ల మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి మధుసూదన్ నాయక్, మున్సిపల్ కమిషనర్ ఎం. గిరీష్,మున్సిపల్ ఇంజనీర్ గాయత్రి మరియు సిబ్బందితో కలిసి గంగాపూర్, కావేరమ్మపేట ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా గంగాపూర్, కావేరమ్మపేట ప్రాంతాల్లో నీటి సంపుల పునరుద్ధరణ పనులు, నూతన బోర్ల ఏర్పాటు పనులను ప్రత్యేక అధికారి మధుసూదన్ నాయక్ పరిశీలించి,పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే కావేరమ్మపేటలోని నీటి సంపు పునరుద్ధరణ పనులను ప్రత్యేకంగా పరిశీలించి, ప్రజలకు తాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

Also Read : చిల్లర కోసం కండక్టర్ ను బస్సు నుంచి కిందికి నెట్టివేసిన ప్యాసింజర్.. చికిత్స పొందుతూ కండక్టర్ మృతి..!

అనంతరం మిషన్ భగీరథ పైప్‌లైన్లలో ఏర్పడిన లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేపడుతున్న పనులను పరిశీలించి, నీటి వృథాను అరికట్టి సరఫరాలో అంతరాయాలు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ప్రత్యేక అధికారి మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి మౌలిక సదుపాయాలను ముందుగానే బలోపేతం చేయాలని, చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మున్సిపల్ కమిషనర్ ఎం. గిరీష్, సంబంధిత ఇంజనీరింగ్ సిబ్బందికి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని, తాగునీటి సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని సూచించారు.

మరిన్ని వార్తలు