Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

BIG BREAKING : పోలీస్ స్టేషన్ ఎదుటే కత్తిపోట్ల కలకలం.. రూ.10 వేల గొడవలో రక్తపాతం..!

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని మాణిక్ బండార్ గ్రామంలో శుక్రవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

BIG BREAKING : పోలీస్ స్టేషన్ ఎదుటే కత్తిపోట్ల కలకలం.. రూ.10 వేల గొడవలో రక్తపాతం..!

(నిజామాబాద్ – గంధం చిరంజీవి)

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని మాణిక్ బండార్ గ్రామంలో శుక్రవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేవలం పది వేల రూపాయల ఆర్థిక లావాదేవీల వివాదం ముదిరి, ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే రక్తపాతానికి దారితీసింది. గ్రామానికి చెందిన వినయ్, శంకర్‌ల మధ్య కొంతకాలంగా రూ.10 వేల విషయమై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో శంకర్.. వినయ్ ఇంటికి వెళ్లి డబ్బులు డిమాండ్ చేయడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది.

ఈ క్రమంలో వినయ్, అతని కుమారుడు కలిసి శంకర్‌పై కట్టెతో దాడి చేయడంతో అతని తలకు బలమైన గాయమైంది. తమపై జరిగిన దాడికి సంబంధించి ఫిర్యాదు చేసేందుకు ఇద్దరూ కలిసి మాక్లూర్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. అయితే, సరిగ్గా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కార్ వద్దకు రాగానే వారి మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఆగ్రహంతో ఊగిపోయిన శంకర్..వినయ్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

Also Read : BIG BREAKING : పేలిన బస్సు టైర్లు, అర్ధరాత్రి హంగామా.. మరెన్నో అప్డేట్స్ మన సాక్షి బిగ్ బ్రేకింగ్..!

ఈ ఘటనలో వినయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్టేషన్ ముందే ఈ రక్తపాత ఘటన జరగడంతో స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగప్రవేశం చేసి, కత్తితో దాడికి పాల్పడిన శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన వినయ్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే, ఈ ఘర్షణ వెనుక అసలు కారణాలపై గ్రామంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ గతంలో స్నేహితులుగా ఉండేవారని, అయితే ఓ భూమి (ల్యాండ్) విషయమై ఇరువురి మధ్య కొంతకాలంగా మనస్పర్థలు, గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు గుసగుసలాడుకుంటున్నారు. మరి ఈ ఘర్షణకు కేవలం ఆ రూ. 10 వేల గొడవే కారణమా..? లేక పాత కక్షలేమైనా ఉన్నాయా..? లేదా దీని వెనుక ఇంకేమైనా ఇతర కారణాలున్నాయా..? అనే కోణంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు