Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుతెలంగాణ

Miryalaguda : మిర్యాలగూడలో 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభం..! 

తమ ప్రభుత్వ హయాంలో చరిత్రలో నిలబడిపోయే ఇరిగేషన్ పనులు చేపడుతున్నామని రాష్ట్ర నీటిపారుదల ,పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు.

Miryalaguda : మిర్యాలగూడలో 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభం..! 

పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మిర్యాలగూడ, మన సాక్షి

తమ ప్రభుత్వ హయాంలో చరిత్రలో నిలబడిపోయే ఇరిగేషన్ పనులు చేపడుతున్నామని రాష్ట్ర నీటిపారుదల ,పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు.
శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణం సమీపంలోని తుంగ పహాడ్ వద్ద 33 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ తమ 5 సంవత్సరాల పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో గోల్డెన్ పీరియడ్ గా మిగిలిపోతుందన్నారు. తమ హయాంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని ,మునుగోడు, దేవరకొండ నియోజక వర్గాలకు సాగు నీరు అందించే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగవంతం చేస్తామని, మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్న ఆశా భావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.

Also Read : BIG BREAKING : పోలీస్ స్టేషన్ ఎదుటే కత్తిపోట్ల కలకలం.. రూ.10 వేల గొడవలో రక్తపాతం..!

జిల్లాలోని బస్వాపూర్, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, తోపుచర్ల, కేశవాపూర్, కొండ్రపోలు, దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేస్తామన్నారు. దామరచర్ల మండలం శాంతి నగర్,రావుల పెంట వాగులపై ఒక్కొక్కటి 9 కోట్ల రూపాయల వ్యయంతో చెక్ డ్యాములను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.వజీరాబాద్ మేజర్ లైనింగ్ పనులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

తాము అధికారంలోకి వచ్చాక నాణ్యమైన సన్న బియ్యం ఇస్తున్నామని,అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ పేదల సొంతింటి కళను నెరవేర్చడం లో భాగంగా రాష్ట్రంలో గత 3 సంవత్సరాలలో మొదటి విడత 4 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందని,2 వ విడత కూడా ప్రారంభించడం జరిగిందన్నారు.

జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన 3600 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన 1000 ఇండ్లను పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని కలెక్టర్ తో కోరారు. ఎస్ ఎల్ బి సి పూర్తయితే , గ్రావిటీ పై నీళ్లు ఇవ్వవచ్చన్నారు. నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేయాలని కోరారు.

నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రానివారు నిరాశ పడవద్దని, విడతలవారీగా అర్హులందరికీ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని, వచ్చే విడతలో మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున భారీ ఇందిరమ్మ ఇండ్ల కాలనీ చేపట్టి అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. తుంగపహడ్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలో తన ఎంపీ నిధులనుండి గ్రంథాలయం, ఓపెన్ జిమ్ ను మంజూరు చేస్తున్నట్లు ఎంపీ ప్రకటించారు. అలాగే దామరచర్ల- రాజాపేట అండర్ పాస్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ 7 ఎకరాల 24 గుంటల స్థలంలో 24 బ్లాకుల్లో 560 ఇండ్లను మిర్యాలగూడ సమీపంలోని తుంగపాడు వద్ద నిర్మించి పేదలకు ఇవ్వడంతో వారి సొంత ఇంటి కల నెరవేరిందని అన్నారు. నూతనంగా ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పార్కు ,విద్యుత్తు, దేవాలయం వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయని ,పేద ప్రజలు కావలసిన సౌకర్యాలతో పూర్తిస్థాయిలో కాలనీని ఏర్పాటు చేశామన్నారు. సుమారు 33 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ కాలనీకి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసామని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ ప్రారంభం తో పాటు, మిర్యాలగూడలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తహసిల్దార్ కార్యాలయాల పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని తెలిపారు.

Also Read : 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్‌ శకం.. ఉత్తమ్ మీటింగ్ లోనే ఫ్లెక్సీ గొడవ..! 

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, గృహనిర్మాణ శాఖ పిడి లోకి లాల్, జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, సర్పంచ్ గోవింద్, మున్సిపల్ వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష, డివిజన్, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అనంతరం మంత్రులు, శాసనమండలి చైర్మన్ లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు ఉత్తర్వులను పంపిణీ చేశారు . ఈ సందర్భంగా “మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి” గోడపత్రికను ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు