Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలు

చెట్ల పొదల్లో వ్యక్తి మృతదేహం.!

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి కేసీఆర్ బిల్డింగ్ సమీపంలో గల చెట్ల పొదల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది.

చెట్ల పొదల్లో వ్యక్తి మృతదేహం.!

గడ్డి మందు తాగి ఆత్మహత్య.?

కుటుంబ కలహాలు.. ప్రమాదంలో కాలు విరగడంతో మనస్తాపం.?

( కరీంనగర్ బ్యూరో – నరేష్ )

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి కేసీఆర్ బిల్డింగ్ సమీపంలో గల చెట్ల పొదల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి వద్ద లభించిన చీటీలోని సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న మృతుడి కుమారుడు సాయికృష్ణ మృతదేహాన్ని తన తండ్రిగా గుర్తించాడు.

మృతుడు అనంతుల సత్యనారాయణ (46) వడ్రంగి వృత్తి చేస్తూ జీవనం సాగించేవాడు. గతంలో తీగలగుట్టపల్లిలోని సరస్వతి నగర్‌లో నివాసముండగా, ప్రస్తుతం గణేష్ నగర్‌లో ఉంటున్నాడు. ఇతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సుమారు 15 ఏళ్ల క్రితం భార్యతో విడిపోయి మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆరు నెలల క్రితం జరిగిన ప్రమాదంలో కాలు విరగడంతో పని చేయలేని పరిస్థితి ఏర్పడింది.

సహజీవనం చేస్తున్న మహిళ సైతం దూరం కావడంతో ఒంటరిగా జీవిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది కేసీఆర్ బిల్డింగ్ సమీపంలోని చెట్ల పొదల్లో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

సాక్షులను విచారించి పంచనామా నిర్వహించడంతో పాటు మృతికి గల ఖచ్చితమైన కారణాలు నిర్ధారించేందుకు పోస్టుమార్టం చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు