Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
తాసిల్దార్ కార్యాలయం వద్ద అగ్ని ప్రమాదం.. పాత రికార్డులు దగ్ధం..?
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల తాసిల్దార్ ఆఫీస్ పక్కన ఉన్న పాత పట్వారి కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది.

తాసిల్దార్ కార్యాలయం వద్ద అగ్ని ప్రమాదం.. పాత రికార్డులు దగ్ధం..?
మన సాక్షి, వెబ్ డెస్క్ :
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల తాసిల్దార్ ఆఫీస్ పక్కన ఉన్న పాత పట్వారి కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పాత రికార్డులు దగ్ధమయ్యాయి. తాసిల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న పాత పట్వారి కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చలరేగాయి. ఈ ప్రమాణంలో అక్కడ నిల్వ ఉంచిన పాత రికార్డులు ఇతర వస్తువులు మంటల్లో ఖాళీ బూడిద అయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.కానీ ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా..? లేక దీని వెనుక ఏదైనా కుట్ర కోణంలో జరిగిందా..? అని అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రెవెన్యూ, పోలీస్ అధికారులు మంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.









