ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అధికారులు.. ఇద్దరి అరెస్ట్..!
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి లంచగొండి అధికారులపై కొరడా ఝళిపిం చింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ (పబ్లిక్ హెల్త్), అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అధికారులు.. ఇద్దరి అరెస్ట్..!
రూ.4.50 లక్షల కాంట్రాక్ట్ బిల్లు మంజూరుకు లంచం డిమాండ్
కార్యాలయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
సంగారెడ్డి, మన సాక్షి :
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి లంచగొండి అధికారులపై కొరడా ఝళిపిం చింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ (పబ్లిక్ హెల్త్), అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం సు మారు 2.30 గంటల సమయంలో మున్సిపల్ కార్యాల యంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
రూ.4.50 లక్షల బిల్లుకు రూ.15 వేల లంచం
ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సదాశివపేట మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ ఏ. రాజేష్ కుమార్, అవుట్‌సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్ ఏ. శివారెడ్డి కలిసి ఈ వ్యవహారంలో పట్టుబడ్డారు. 2025లో గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఉబా చెరువులో చేపట్టిన పూడికతీత పనులకు సంబంధించి కాంట్రాక్టర్‌కు రూ.4.50 లక్షల బిల్లు మంజూరైంది.
ఈ బిల్లుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసినందుకు ప్రతిఫలంగా అసిస్టెంట్ ఇంజనీర్ రాజేష్ కుమార్ ఫిర్యా దుదారుని నుంచి రూ.15 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరించారు. అనంతరం ఆ నగదును భద్రపరచడానికి వర్క్ ఇన్‌స్పె క్టర్ శివారెడ్డికి అప్పగించారు. అప్పటికే పక్కా సమాచా రంతో నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు దాడి చేసి, శి వారెడ్డి వద్ద నుంచి లంచం సొమ్ము రూ.15 వేలను స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరి అరెస్ట్.. కోర్టుకు తరలింపు
ప్రభుత్వ విధులను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు రాజేష్ కుమార్, శివారెడ్డిలను అరెస్టు చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల విచారణకు సంబంధించిన II అదనపు ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుని భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన పేరు, ఇతర వివరాలను ఏసీబీ అధికారులు గోప్యంగా ఉంచారు.
లంచం అడిగితే 1064కు ఫోన్ చేయండి
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా తెలంగాణ ఏసీబీని సంప్రదించాలని అధికారులు ప్రజలకు సూచించారు.
టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ 9440446106, ఫేస్ బుక్ Telangana ACB,ఎక్స్ (ట్విట్టర్) @Telangana ACB లలో ఫిర్యాదు చేయవచ్చని అంతేకాకుండా ప్ర భుత్వ కార్యాలయాలు, ప్రధాన బహిరంగ ప్రదేశాల్లో ఏసీబీకి సంబంధించిన క్యూఆర్ కోడ్‌లను కూడా ఏర్పా టు చేశారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతా మని ఏసీబీ స్పష్టం చేసింది.









