Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Crime News : ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు..!

Crime News : ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు..!

చింతపల్లి, మన సాక్షి:

సంచార జాతులకు చెందన ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి ఒకరి హత్యకు దారి తీసిన సంఘటన చింతపల్లి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపి న వివరాలు ప్రకారం మండలంలోని తీదేడు గ్రామంలో గత కొంతకాలంగా సంపంగి ఎల్లయ్య , సంపంగి కోటేష్, ఆలకుంట్ల రాజు గ్రామంలో ఒకే దగ్గర నివాసం ఉంటూ బండలు, కంకర కొట్టి జీవనం కొనసాగిస్తున్నారు.

అయితే వారు చేసే పని వద్ద, సంపంగి కోటేష్ కు, ఆలకుంట్ల రాజుకు శుక్రవారం ఘర్షణ పడ్డారు. దీంతో ఆ విషయమై రాజును ప్రశ్నించేందుకు గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న పశువుల దావకాన సమీపంలో మాట్లాడుతుండగా రాజు కొటేషన్ బ్లేడ్ తో మెడ కోశాడు. దీంతో పక్కనే ఉన్న కోటేష్ తండ్రి అయిన సంపంగి ఎల్లయ్య కోపోద్రిక్తుడై తన చేతిలో ఉన్న కర్రతో రాజును తలపై బలంగా కొట్టాడు.

దీంతో రాజు స్పృహ తప్పి కింద పడిపోయాడు. అంతటితో ఆగకుండా రాజును బండరాయితో కాళ్లపై మోదడంతో తీవ్ర రక్తస్రావమై రాజు 35 మధ్య రాత్రి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఒక కూతురు ఇద్దరు కుమారులు కలిగి ఉన్నారు. సంఘటన విషయం తెలుసుకున్న దేవరకొండ డిఎస్పి గిరిబాబు, నాంపల్లి సిఐ నవీన్ కుమార్, చింతపల్లి ఎస్ఐ బి యాదయ్యలు గ్రామాన్నిసందర్శించి వివరాలను సేకరించారు. రాజు మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి భార్య దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : 

Suryapet : లంచాలు తీసుకొని ఆస్పత్రిలో ఉద్యోగాలు.. ఆందోళన..!

Miryalaguda : రైతులను ఇబ్బంది పెడుతున్న ఆ రైస్ మిల్లు సీజ్ చేయండి.. కోమటిరెడ్డి ఆదేశం..!

Telangana : తెలంగాణలో ఘోరం.. కన్న కొడుకుని కడతేర్చిన తల్లి..!

Congress party : జానారెడ్డి సమక్షంలో సొంతగూటికి చేరిన మాజీ జడ్పిటిసి..!

మరిన్ని వార్తలు