KCR : కెసిఆర్ కు మరో షాక్.. మరో సిట్టింగ్ ఎంపీ రాజీనామా..!

బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు మరో షాక్ తగిలింది. ఇటీవల నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. ఎంపీ రాములు బిజెపిలో చేరి ఒక్కరోజు గడవకు ముందే మరో షాక్ తగిలింది.

KCR : కెసిఆర్ కు మరో షాక్.. మరో సిట్టింగ్ ఎంపీ రాజీనామా..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు మరో షాక్ తగిలింది. ఇటీవల నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. ఎంపీ రాములు బిజెపిలో చేరి ఒక్కరోజు గడవకు ముందే మరో షాక్ తగిలింది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బిజెపిలో చేరారు. ఆయనకు బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి పార్టీ కండువా కప్పి బేబీ పాటిల్ ను బిజెపిలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ మాట్లాడుతూ లోకసభ ఎన్నికల సమయంలో నేతలంతా బిజెపిలోకి వలసలు వస్తున్నారన్నారు. త్వరలో తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని, బిజెపి విధానాలు ఆకర్షితులై సిట్టింగ్ ఎంపీలు కూడా బిజెపిలో చేరుతున్నారని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ కు అన్ని షాక్ లే :

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ కు అన్ని షాక్ లే ఎదురవుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెసులో చేరగా ఇటీవల నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు బీఆర్ఎస్ రాజీనామా చేసి బిజెపిలో చేరారు. అదేవిధంగా జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బిజెపిలో చేరారు. రాబోయే ఎన్నికలు సమీపిస్తుండగా ఇలాంటి సంఘటనలతో బీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

MOST READ :