Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణరాజకీయం

Sarpanch Elections : స్థానికంలో చిత్ర విచిత్రాల పొత్తులు..!

Sarpanch Elections : స్థానికంలో చిత్ర విచిత్రాల పొత్తులు..!

తుంగతుర్తి మన సాక్షి,

పంచాయితీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరిగేవే.. అయినప్పటికీ రాజకీయ పార్టీలదే ఫై చేయిగా నిలుస్తుంది. వివిధ పార్టీలు బలపరిచిన అభ్యర్థులే ప్రధాన పోటీ అభ్యర్థులుగా నిలుస్తున్నారు. దాంతో చిత్ర విచిత్రాల పొత్తులు సాగుతున్నాయి.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని పలు గ్రామాలలో విచిత్రమైన పొత్తులతో పలు పార్టీల నాయకులు నేటి సర్పంచి ఎన్నికలలో పొత్తులను కుదురుకొని గెలవడానికి సన్నాహాలు చేస్తున్నారు. పంచాయితీలో ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మంది తమ పార్టీ మద్దతుదారులు గెలిచేలా ప్రణాళికలు రూపొందించింది.

బి.ఆర్ఎస్, బిజెపి. సిపిఎం, సిపిఐలు సైతం తమ తమ పార్టీ లు బలంగా ఉన్నచోట సత్తా చాటాలని భావిస్తూ పోటీలో నిలిచాయి. అయితే స్థానిక పరిస్థితుల్లో బలంగా లేని పార్టీలు సర్పంచి అభ్యర్థిగా తమ పార్టీ వ్యక్తిని బలపరిచి ఆర్థికంగా ఇబ్బందులు పడద్దని పొత్తులకు వెళ్లాయి. ఈ పొత్తుల కారణంగా పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల మధ్య విభేదాలు వచ్చి ఎవరి దారి వారు చూసుకునే పరిస్థితి నెలకొంది.

కొన్నిచోట్ల అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంలో మొదటి నుంచి వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాల్లో సర్పంచి వార్డు సభ్యుల అభ్యర్థు లు నచ్చక పోవడం మరో పార్టీతో జతకట్టే ఎన్నికల బరిలో నిలిచారు. ఈ పొత్తులు ఇలా ఉండగా ప్రచారాలకు వెళుతున్న నాయకులను చూసి ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

విచిత్రమైన నాయకులు విచిత్రమైన పొత్తులతో గ్రామాలలో తనదైన శైలితో ప్రజలను ఆకర్షణ చేసుకుంటూ డబ్బు బలంతో కొంతమంది, మందు పోసి మాయ చేస్తూ గారడీలు చేస్తున్న ఇంకా కొంతమంది నాయకులు ఇలా మూడు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి పార్టీలు మారుతూ ఏ పార్టీ అధికారంలో ఉంటుందో వారి పార్టీలో చేరి నాయకులు కొంతమంది పూటలు గడుపుతూ పైరవీలు చేసుకుంటూ సంపాదించుకుంటున్న కొంతమంది నాయకులకు కలిసి వస్తుంది.

ఇకపోతే గ్రామంలో యూత్ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి పార్టీలను ఏర్పాటు చేస్తూ మందు బాటిళ్లతో డబ్బుతో కొనుగోలు చేస్తున్నారు. గతంలో నాయకులు కార్యకర్తలు చాలా నీతిమంతులుగా వ్యవహరించేవారు. కానీ ఇటీవల రాజకీయం డబ్బు, మద్యంతో ప్రజలను కూలీలుగా వాడుకొని పబ్బం గడుపుకుంటారు.

మేజర్ గ్రామపంచాయతీలో నిధులు ఎక్కువగా ఉండడంతో వాటిని స్వాహా చేయడానికి కుల సంఘాలను పట్టుకొని డబ్బులు ఇస్తూ ఇక మీకు భవనాలు కట్టిస్తాం ఏ సమస్య రాకుండా చేస్తాం అని ఓటుకు వెయ్యి నుండి 2000 సమర్పిస్తూ గెలవగానే వాటిని పూడ్చుకోవడానికి ఎన్నో మార్గాలు చూస్తున్నారు. ఇది అంతా మనం చూస్తున్నదే ఈ రోజులలో నీతి నిజాయితీ ఏమి అక్కర రావడంలేదని మరికొంతమంది యువకులు బానిసలుగా మారుతున్నారు.

రాజకీయాలు జూదం మాదిరిగా మారుతున్నాయి. ప్రతి ఒక్కరూ.. డబ్బుకు, మద్యానికి ఓటును అమ్ముకోవద్దని ప్రభుత్వం కళాకారుల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఇకపోతే పాఠశాల విద్యార్థులు కూడా గ్రామాలలో తిరుగుతూ మన ఓటును అమ్ముకోవద్దు.. అమ్ముకుంటే ఐదు సంవత్సరాలు గోసపడతాము అని వారి కుటుంబ సభ్యులకు గ్రామ ప్రజలకు తెలియపరుస్తున్న చిన్నారులు.

By : Oruganti Subhash

98661 10948

MOST READ : 

  1. CM Revanth Reddy : స్క్రిప్ట్ తో వస్తే చాలు.. సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా..!

  2. INSURANCE : పోస్టల్ శాఖ భారీ గుడ్ న్యూస్.. రూ.750 చెల్లిస్తే 15 లక్షల ఇన్సూరెన్స్.. ఇలా సద్వినియోగం చేసుకోండి..! 

  3. EV : సరికొత్త ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ కారు.. గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..!

  4. TG News : అట్టహాసంగా ప్రారంభం కానున్న గ్లోబల్ సమ్మిట్..!

మరిన్ని వార్తలు