Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

కారు అపహరించి ఏటీఎం చోరీ..!

కారు అపహరించి ఏటీఎం చోరీ..!

బాల్కొండ, మన సాక్షి :

దొంగతనం చేసిన కారులో వచ్చి ఏటీఎం డబ్బులు దోచుకెళ్లారు. వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా మోండోరా మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి డిచ్ పల్లి లో ఆపి ఉన్న కారును దొంగతనం చేశారు.

అక్కడి నుంచి అందులోనే బుధవారం తెల్లవారు జామున దూద్గాం శివారులోని పోచంపాడు ఎస్బిఐ శాఖ ఏటీఎం వద్దకు వెళ్లారు. ఏటీఎం ఉన్న గది షట్టర్ గ్యాస్ కట్టర్ తో ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. ఈ సమయంలో దొంగలు సీసీ కెమెరాకు నల్లటి రంగు పూశారు. ఏటీఎంను కూడా గ్యాస్ కట్టర్ తో ద్వంసం చేసి 12 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. అనంతరం కారులోనే పారిపోయారు.

దొంగలు చోరీకి పాల్పడిన సమయంలో నిజామాబాద్ లోని బ్యాంకు ఉద్యోగి రషీద్ కు అలారం మెసేజ్ కూడా వచ్చింది. ఆయన వెంటనే స్థానిక పోలీసులకు , బ్యాంకు ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకునే లోపే దొంగలు డబ్బులు దోచుకుని పరారయ్యారు.

సంఘటన స్థలాన్ని నిజామాబాద్ అడిషనల్ డీసీపీ జయరాం , ఆర్మూర్ ఏసిపి జగదీష్ చందర్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం పరిశీలించారు. చోరీ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్ సిఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.

ALSO READ ; 

మరిన్ని వార్తలు