సూర్యాపేట : బి సి ల అందరికి లక్ష రూపాయలు ఇవ్వాలి

సూర్యాపేట : బి సి ల అందరికి లక్ష రూపాయలు ఇవ్వాలి

బీసీ నేత ధనుంజయ నాయుడు

సూర్యాపేట, మనసాక్షి

బీసీలకు… లక్ష పథకాన్ని కొన్ని కులాలకే ఎందుకు పరిమితం చేయడం సబబు కాదని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు.
శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయం ధర్మభిక్షం భవన్ లో బీసీ ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడుతూ

 

బీసీ కుటుంబాల అభివృద్ధికై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు కేటాయిస్తామని ప్రకటించారని, కేవలం 15 కులాల వారికి మాత్రమే లక్ష రూపాయలు ఇస్తున్నట్టు జీవో విడుదల చేశారని, మరి మిగతా కులాల వారి పరిస్థితి ఏమిటని, ఇంకెంతకాలం బీసీలను మోసం చేస్తారని అన్నారు.

 

గత తొమ్మిది సంవత్సరాలుగా గుర్తుకురాని బీసీలు ఒక్కసారిగా ఎందుకు గుర్తుకొచ్చారని, కనీసం ఇప్పటికైనా అన్ని కులాల వారికి సమన్యాయం చేయాలని కోరారు. ముఖ్యంగా పద్మశాలి, గౌడ, ముదిరాజు, గొల్ల కురుమలు, మున్నూరు కాపులను పక్కకు పెట్టారని ఈ కులాల వారు కూడా అనేకమంది దారిద్రరేఖకు దిగువన జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

 

ALSO READ : RBI : రూ. 500 నోట్లపై ఆర్ బీ ఐ కీలక ప్రకటన..!

 

బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి బడ్జెట్లో 20వేల కోట్లు కేటాయించాలని, బీసీ జనగణన చేపట్టే విధంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కేంద్రం అమలు చేసినా చేయకపోయినా తెలంగాణలో బీసీ జనగణన చేపట్టాలని అన్నారు. తద్వారా బీసీల వెనుకబడి తనాన్ని గుర్తించి వారికి ప్రభుత్వ పరంగా ఇల్లు,,,ఇళ్ల స్థలాలు,,,ఆరోగ్య భీమా వారి కుటుంబాల్లోని పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలని డిమాండ్ చేశారు.

 

బీసీ జనోదరణకు నిజంగా చిత్తశుద్ధిగా కోరుకునే వారైతే రాష్ట్రంలో ఉన్న బీసీ నేతలతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి వారి సూచనలు సలహాలు స్వీకరించి ఏకాభిప్రాయ సాధన తో బీసీ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన సూచించారు.

ఈ సమావేశంలో బీసీ హక్కుల సాధన సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు దంతాల రాంబాబు, పట్టణ సిపిఐ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపగాని రవి, ఏఐటీయూసీ సూర్యాపేట ప్రాంతీయ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్ ఉన్నారు.

 

ఎక్కువమంది చదివిన వార్తలు .. క్లిక్ చేస్తే మీరు చదవచ్చు : 

1. ATM CARD | ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా .. బ్యాంకు కొత్త సర్వీస్.. ఎలా చేయాలో తెలుసుకుందాం..!

2. Rythu Bandhu : రైతు బంధు కోసం .. ఆ రైతులు ఇలా చేయాలి..!

3. Upi Payments | ప్రతిరోజు ఎక్కువ సార్లు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

4. Good News : వెనుకబడిన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సహాయం.. ! దరఖాస్తు చేసుకోండిలా…!

5. Central Govt : కేంద్రం కీలక నిర్ణయం.. సామాన్యులకు ఊరట..!