Breaking Newsక్రైంజిల్లా వార్తలుమహబూబాబాద్ జిల్లావిద్య
Breaking : స్కూల్ బస్సును ఢీకొన్న లారీ..!
స్కూల్ బస్సు కు తృటిలో ప్రమాదం తప్పింది. 50 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.

Breaking : స్కూల్ బస్సును ఢీకొన్న లారీ..!
మన సాక్షి, మహబూబాబాద్ :
స్కూల్ బస్సు కు తృటిలో ప్రమాదం తప్పింది. 50 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా తోరూరు పట్టణంలో సెయింట్ పాల్స్ స్కూల్ బస్సును అతివేగంగా వచ్చి లారీ ఢీ కొట్టింది. ఈ సమయంలో స్కూల్ బస్సులో 50 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు సురక్షితంగా ఉండడంతో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు.









