Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో రైస్ మిల్లుల్లో ఆర్డిఓ తనిఖీలు..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆర్డీవో రామణారెడ్డి బుధవారం రైస్ మిల్లులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

Miryalaguda : మిర్యాలగూడలో రైస్ మిల్లుల్లో ఆర్డిఓ తనిఖీలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆర్డీవో రామణారెడ్డి బుధవారం రైస్ మిల్లులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న దాన్యం బస్తాలను వేగవంతంగా దిగుమతి చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
మిర్యాలగూడ మండలం, వేములపల్లి మండలంలోని పలు రైస్ మిల్లులలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే దాన్యమును దిగుమతి చేసుకోకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకోనున్నట్లు ఆయన హెచ్చరించారు.









