Nalgonda : ఎల్ ఆర్ ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని బి ఆర్ఎస్ ధర్నా

ఎల్ఆర్ఎస్ పై ఉప ముఖ్యమంత్రి భట్టి మాటలువట్టి మాటలయ్యాయని..ఉత్తమ్ కుమార్ ముచ్చట.. ఉత్త ముచ్చటేనని జెడ్పి ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Nalgonda : ఎల్ ఆర్ ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని బి ఆర్ఎస్ ధర్నా

నల్లగొండ, మనసాక్షి.

ఎల్ఆర్ఎస్ పై ఉప ముఖ్యమంత్రి భట్టి మాటలువట్టి మాటలయ్యాయని..ఉత్తమ్ కుమార్ ముచ్చట.. ఉత్త ముచ్చటేనని జెడ్పి ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. బారుకు వెళ్ళడమే తెలిసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో LRSపై కోర్టుకు వెళ్ళారని.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 20 వేల కోట్ల దోపిడీకి కుట్ర చేస్తే ఎక్కడకి పోతాడో చెప్పాలని వారు ప్రశ్నించారు.

ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని క్లాక్ టవర్ సెంటర్లో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం గడియారం సెంటర్లో ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పి ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెసు అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని తప్పుడు హామీ ఇచ్చి నేడు అధికారంలోకి రాగానే సామాన్య ప్రజలపై దాదాపు రూ.20 వేల కోట్ల బాదుడుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని వారు మండిపడ్డారు.

ALSO READ : Telangana : గులాబి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పేందుకు ముహూర్తం ఫిక్స్.. ఎంతమంది ఉన్నారంటే..!

ఎల్ఆర్ఎస్ పై మాట మార్చిన కాంగ్రెస్ ను బొందపెట్టాలనీ ప్రజలు అనుకుంటున్నారని.. ఇక కాంగ్రెస్ కు గోరి కట్టే సమయం ఆసన్నమైందని అన్నారుమేము చేస్తే సంసారం ఎదుటివారు చేస్తే వ్యభిచారం అన్నట్లు కాంగ్రెసు ప్రభుత్వం రెండు నాల్కల ధోరణిలో వ్యవహరిస్తోందని వారు అన్నారు. ఈ ఉత్తర కుమారుల పాలనలో తెలంగాణ ఎడారిగా మారుతుందని.. నీళ్లు లేక పొట్టకొచ్చిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్లతో నీళ్ళు తెచ్చుకుంటున్నారని.. ఇంత జరుగుతున్నా గుంపుమేస్త్రీ ప్రభుత్వం ఏం చేస్తుందనీ వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేసేంత వరకు మా పోరాటం ఆగదని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీలు, చైర్మన్ వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ పట్టణ మండల కమిటీ సభ్యులు, పార్టీ పట్టణ వార్డు కమిటీ సభ్యులు, ఇన్చార్జులు, గ్రామ కమిటీలు అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Crime News : లవ్ చేస్తావా, పోటోలు వైరల్ చేయమంటావా.. ఇంటర్ కళాశాలలో కామాంధుడు..!