సినీ డైరెక్టర్ కు అరుదైన గౌరవం

సినీ డైరెక్టర్ కు అరుదైన గౌరవం

అదిలాబాద్ సెప్టెంబర్ 20 మనసాక్షి ప్రతినిధి:  తెలంగాణ సినీ టెలివిజన్ కళాకారుల సేవా సంస్థ ఉపాధ్యక్షునిగా ప్రముఖ సినీ డైరెక్టర్ ఫయిం సర్కార్ నియామకం… అదిలాబాద్ జిల్లా కేంద్ర నివాసి ప్రముఖ సినీ డైరెక్టర్ మొహమ్మద్ ఫహిముద్దీన్/ఫయిమ్ సర్కార్ కు అరుదైన గౌరవం లభించింది… ముంబై కేంద్రంగా నడపబడుచున్న సినీ టెలివిజన్ కళాకారుల సేవా సంస్థ కు తెలంగాణ రాష్ట్రం నుండి ఉపాధ్యక్షునిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందించడం జరిగింది.

ALSO READ : రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటీలకు చేగొమ్మ విద్యార్థినులు

ఈ సందర్భంగా ఫయిమ్ సర్కార్ మాట్లాడుతూ…  తన నైపుణ్యాన్ని గుర్తించి, ఆదిలాబాద్ జిల్లా వాసి అయిన తనకు.. ఇంత మంచి అవకాశం ఇచ్చిన… సంస్థ అధ్యక్షులు నరేంద్ర పాటిల్, కార్యదర్శులు హరిచంద్ర, కిషోర్ పాటిల్ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు అని, ప్రతి నటునికి, కళాకారునికి వెన్నంటి ఉండి వారి యోగక్షేమాలు నా జీవిత లక్ష్యంలో సాగుతానని, ముందు ముందు మరెన్నో సినీ అవకాశాలు అందుకొని నటులతో కళాకారులతో కలిసి ప్రయాణించి మరెన్నో సినీ విజయాలు మా జీవితంలో మైలురాళ్లుగా మార్చుకుంటామని అన్నారు.

ALSO READ : జాతీయస్థాయి కరాటే పోటీలలో నవ జ్యోతి  విద్యార్థుల ప్రతిభ

అదిలాబాద్ జిల్లా వాసికి ఇంత చక్కటి అరుదైన అవకాశం రావడం చాలా అదృష్టమని, ఆనందంగా ఉంది అని అదిలాబాద్ జిల్లా అన్ని వర్గాల కళాకారులు ఆనందం వ్యక్తం చేశారు..జిల్లా కేంద్ర ప్రముఖ సామాజిక వేత్త , బెస్ట్ ఫ్రెండ్స్ సెల్ఫీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఇది ఒక గొప్ప కళాకారుని లభించిన గొప్ప బహుమానం అన్నారు.