Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : సీఎం కప్ క్రీడాజ్యోతి ర్యాలీ.. ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ..!

Narayanpet : సీఎం కప్ క్రీడాజ్యోతి ర్యాలీ.. ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

గ్రామీణ ప్రాంత క్రీడాకారుల క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రపంచ స్థాయిలో విజేతలను చేసేందుకు సి.ఎం. కప్ ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు.

శనివారం సాయంత్రం జిల్లా కేంద్ర సమీపంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి సీఎం కప్ క్రీడా జ్యోతి ర్యాలీని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రారంభమైన క్రీడాజ్యోతి ర్యాలీ జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తా వద్ద ముగిసింది.

అంతకు ముందు జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే నెలలో ప్రారంభం కానున్న సి.ఎం.కప్ క్రీడా పోటీలలో నారాయణపేట జిల్లా నుంచి క్రీడాకారులు పాల్గొని రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాలని ఆమె ఆకాంక్షించారు. నవంబర్ మొదటి వారంలో సి.ఎం కప్ క్రీడా పోటీలు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని జిల్లాస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులతో హైదారాబాద్ లో రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహిస్తారని ఆమె తెలిపారు.

గ్రామాల్లో ఉన్న విద్యార్థుల క్రీడా సామర్థ్యాన్ని వెలికి తీసి ప్రపంచ స్థాయి విజేతలుగా నిలిపేందుకు ఈ క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. సీఎం కప్ ర్యాలీకి సంబంధించి ఈ నెల 21 న హైదరాబాద్ లో సెర్ మనీ ఉంటుందని ఆమె తెలిపారు.

మన జిల్లాలో కొన్ని ప్రాంతాలలో క్రీడలకు చాలా పేరు ఉందని, రెజ్లింగ్ పోటీలలో ప్రతిభ చాటుతున్న విద్యార్థులు కూడా ఉన్నారని ఆమె చెప్పారు. ముఖ్యంగా క్రీడాకారులు ఎలాంటి సమస్యలు వచ్చిన వాటిని సానుకూలంగా పరిష్కరించుకుంటారన్నారు. జిల్లాకు చెందిన విద్యార్థులు తప్పకుండా ఈ క్రీడల్లో పాల్గొని నారాయణపేట కు రాష్ట్రస్థాయిలో పేరు తీసుకురావాలని సూచించారు..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ విద్యార్థులు ఆటలు ఆడటం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక వికాసం, క్రీడా స్ఫూర్తి అలవడుతుందనీ తెలిపారు. తన చిన్న వయసులో అందరూ చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయని అనేవారని, ఆటలాడితే రావనే అపోహ ఉండేదని, కానీ ఇప్పుడు చదువుకుంటేనే కాదు.. ఆటలాడితే( క్రీడా కోటలో) కూడా ఉద్యోగాలు వస్తాయని హిందీ నానుడి ని ఈ సందర్భంగా ఎస్పీ ఉదాహరించారు.

సి.ఎం.కప్ క్రీడలను జిల్లాలోని విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘనీ, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, మాజీ చైర్మన్ సరాఫ్ నాగరాజు, జిల్లా యువజన సర్వీసుల శాఖ సిబ్బంది సాయి కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు, గురుకుల పాఠశాల విద్యార్థిని , విద్యార్థులు, క్రీడాకారులు భారీ సంఖ్యలో ర్యాలీ లో పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు