తెలంగాణ భవన్ కు ముఖ్యమంత్రి కెసిఆర్

తెలంగాణ భవన్ కు ముఖ్యమంత్రి కెసిఆర్

హైదరాబాద్ , మన సాక్షి :

మరికొద్ది సేపట్లో అసెంబ్లీ టికెట్లు ప్రకటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటిస్తారని ఊహాగానాలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా గులాభినేతలంతా తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు.

 

సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఆశావాహులను కూడా తెలంగాణ భవన్ కు రావాలని పార్టీ వర్గాలు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. తొలి జాబితా పై అందరిలోనూ ఉత్కంఠ నెలకొన్నది. గతంలో మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాలను ఒకేసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారని సమాచారం.

 

తొలి జాబితాలో తమ పేరు ఉంటుందో.? లేదో ..?అని సిట్టింగ్లలో ఉత్కంఠత నెలకొన్నది. ముందుగానే పలువురు నేతలు ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీష్ రావును సైతం కలిశారు. జాబితా ప్రకటించగానే పేర్లు ఉన్న వాళ్ళు సంబరాలు జరుపుకోవడానికి ఏర్పాట్లు సైతం చేశారు. ఆశావహులను బుజ్జగించే ప్రయత్నం కూడా రెండు రోజులుగా పార్టీ వర్గాలు నిర్వహించినట్లు సమాచారం.

 

కాగా సెట్టింగ్ ఎమ్మెల్యేలలో కేవలం ఎనిమిది నుంచి పదిమందికి మాత్రమే టికెట్లు నిరాకరించినట్లు తెలిసింది . మిగతా వారందరికీ యధావిధిగా టికెట్లు నిర్ణయించినట్లు సమాచారం. ఏది ఏమైనా మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ లో తొలి జాబితాను ప్రకటిస్తారని సమాచారం.

 

MOST READ :

  1. మళ్లీ వచ్చేది బి ఆర్ ఎస్ ప్రభుత్వమే : ముఖ్యమంత్రి కేసీఆర్